కలలు కనటం అందరూ చేసేదే. కానీ.. కనే కలల్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసే వారు చాలా తక్కువగా ఉంటారు. అన్నింటికి మించి రిచ్ కలల్ని కనటమే కాదు.. వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే అవకాశం చాలా తక్కువమందికే ఉంటుంది. అలాంటి లక్కీ సీఎంలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు.
కలల్ని కనే అవకాశం ఉన్నా.. వాటిని నెరవేర్చుకునే పరిస్థితులు అందరికి ఉండవు. కానీ.. అందుకు మినహాయింపుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కనిపిస్తారు.
తన మూడేళ్ల పదవీ కాలంలో ఇప్పటికే పలు కలల్ని ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. తాజాగా మరో భారీ కలను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ కే మకుటాయమానంగా ఉండేలా సరికొత్త అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలని కేసీఆర్ డిసైడ్ చేశారు.
విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికే అమరవీరుల స్థూపం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్ పార్క్ లో ఉంది. కానీ.. తాజాగా మరో అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలని.. దాన్ని తనదైన రిచ్ నెస్ తో నింపాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెప్పాలి. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మించే ఈ అమరవీరుల స్మారకస్థూపం ఎంత రిచ్ గా.. మరెంత గ్రాండ్ గా ఉండనుందన్న విషయాన్ని చూస్తే..
= 200 అడుగుల ఎత్తులో ఈ సరికొత్త అమరవీరుల స్థూపం ఉండనుంది.
= హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆరు అంతస్థుల ఎత్తులో ఆహ్లాదకర వాతావరణం.. ఓ భారీ భవనం.. దానిపై సరికొత్త స్థూపం ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ఆలోచన
= ఇందుకోసం లుంబినీ పార్క్ లోని రెండున్నర ఎకరాల్ని దీని కోసం కేటాయించారు.
= దాదాపు 350 కార్లు పార్క్ చేసుకోవటానికి వీలుగా భూమి లోపల రెండు అంతస్తుల పార్కింగ్ నిర్మాణం
= ఒక్కో అంతస్తులో 72 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది.
= రెండు అంతస్తుల పైన ఆరు అంతస్తుల ఎత్తులో భారీ భవన నిర్మాణం
= ఒక్కో అంతస్తు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణం
= ఒక అంతస్తులో సమావేశాలు.. సదస్సుల నిర్వహణకు ఆడిటోరియం.. మరోదానిలో ఆర్ట్ గ్యాలరీ.. మరో దానిలో ప్రదర్శనల ఏర్పాటుకు అనువుగా ఏర్పాట్లు
= ఆరు అంతస్తులపైన 100 అడుగుల ఎత్తులో అమరవీరుల స్తూపం
= ఆరో అంతస్తుపై ఉండే ఖాళీ ప్రదేశంలో సందర్శకులు చుట్టూ తిరుగుతూ హుస్సేన్ సాగర్ అందాల్ని వీక్షించే వెసులుబాటు.
= భూమి నుంచి 200 అడుగుల ఎత్తులో నిర్మాణం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 కోట్ల ఖర్చు. వచ్చే ఏడాది మధ్య నాటికి నిర్మాణం పూర్తి చేసేలా ఏర్పాట్లు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/