ఉద్యమ అధినేతగా.. తెలంగాణ జాతిపితగా పేరుప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న కేసీఆర్.. తాజాగా అనుసరిస్తున్న తీరు ఇప్పుడు ఆయనపై కొత్త మరకల్ని పడేలా చేస్తోంది. సుదీర్ఘ కాలం సాగిన ఉద్యమంలో.. మలి విడతలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కెరటంతో తెలంగాణ స్వప్నం సాకారమైందన్నది మర్చిపోకూడదు.
దీనికి కారణం ఎవరైనా.. క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఖాతాలో పడిందని చెప్పాలి. ఉద్యమానికి సారథ్యం వహించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమయ్యారన్న పేరుప్రఖ్యాతులే కాదు.. తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల మనసుల్లో నిలిచిపోయిన పరిస్థితి. అలాంటి ఉద్యమాధినేత.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాధినేతగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. కొత్త మరకలు అంటుతున్నాయి.
ఉద్యమం జరుగుతున్న వేళ.. ఉద్యమకారుల్ని అణిచివేసేందుకు ఉమ్మడి రాష్ట్ర ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలు చేసిన తీరులోనే.. తాజాగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను పోలీసులతో అణిచి వేయాలని కేసీఆర్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఉద్యమాన్ని నీరుకార్చటానికి ప్రయత్నిస్తున్నారని.. తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న వేళ సకల జనుల సమ్మె చేపడితే ఎస్మా ప్రయోగిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి బెదిరించారని.. ఈ రోజున కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి సమ్మె చేస్తున్న కార్మికుల ఉద్యోగాలు పీకేశామన్న ప్రకటనతో రెచ్చగొడుతున్నారన్న మండిపాటు పలువురు నేతల నోట వినిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పేరు వినిపించిన స్థానే.. ఇప్పుడు తెలంగాణ సాధనను అడ్డుకునేందుకు ప్రయత్నించి భంగపడిన కిరణ్ కుమార్ రెడ్డిగా గులాబీ బాస్ పేరు ముడివేయటాన్ని ఎలా చూడాలి? ఇలాంటి పరిస్థితిని కేసీఆర్ తనకు తాను తెచ్చుకున్నారన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. తెలంగాణ జాతిపితగా యావత్ తెలంగాణ ప్రజానీకం నీరాజనాలు అందుకున్నవ్యక్తి.. తన నిర్ణయాలతో అందుకు భిన్నమైన రీతిలో మాట అనిపించుకోవటాన్ని ఎలా చూడాలంటారు?