తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కావడం చర్చానీయాంశమైంది. ఓ వైపు మంత్రివర్గంలో మార్పులు.. చేర్పులు చోటు చేసుకోనున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అర్ధాంతరంగా గవర్నర్ తో భేటీ కావడంపై రాజకీయవర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. సుదీర్ఘ సమయం పాటు గవర్నర్ తో కేసీఆర్ భేటీ కావడం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది. మంత్రివర్గం మార్పులు ఊహించినప్పటికీ అదెప్పుడు జరుగుతుందనేదే అసలు ట్విస్ట్. ఈ క్రమంలో కొత్త సమాచారం తెరమీదకు వచ్చింది.
మంత్రివర్గలో మార్పులు.. చేర్పుల విషయంపై గవర్నర్ కు సీఎం కేసీఆర్ వివరించినట్టు సమాచారం. మంత్రివర్గంలో మచ్చపడ్డ ముగ్గురు మంత్రుల విషయంపై కూడా ఆయన గవర్నర్ కు వివరాలు అందజేసినట్టు తెలిసింది. ప్రభుత్వానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా ఉండేందుకే ఆ మంత్రులకు ఉద్వాసన పలకాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొందరు మంత్రులు శాఖల మార్పులపై కూడా ఆయన గవర్నర్ కు తెలియజేసినట్టుగా చెప్తున్నారు. వీలైనంత త్వరగా మంత్రివర్గంలోకి తీసుకునే మంత్రుల పేర్లను కూడా వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ మంత్రివర్గంలోని ఆ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలుకుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే ఒక మహిళా ఎమ్మెల్యేతో పాటు ఇటీవలే టీటీడీపీ నుంచి వలస వచ్చిన ఒక ఎమ్మెల్యే - టీఆర్ ఎస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేతకు మంత్రి పదవులు వరించనున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం అర్ధాంతరంగా గవర్నర్ ను కలవడం పట్ల మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎవరిని తొలగిస్తున్నారు.. ఎవరి శాఖలను మార్పు చేస్తున్నారన్న విషయాలను తెలుసుకునే పనిలో మంత్రులు నిమగమైయ్యారు. అయితే మంత్రివర్గ మార్పు చేర్పులు వెంటనే ఉండవని సమాచారం. ఈ నెలలో ఖమ్మంలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు గులాబీ వర్గాలు చెప్తున్నాయి.