12 ఏళ్ల పోరగాళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లట కేసీఆర్

Update: 2016-12-20 07:17 GMT
పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇచ్చే కార్యక్రమాన్నిప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అందులో భాగంగా తాను దత్తత తీసుకున్నగ్రామంలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఇళ్ల కేటాయింపులో వివక్ష ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక టీఆర్ ఎస్ నేతల కారణంగా ఇళ్ల కేటాయింపులో తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి.

ఒకే కుటుంబానికి రెండు.. మూడు ఇళ్లను కేటాయించటం.. 12 ఏళ్ల పోరగాళ్లకు కూడా డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తున్న తీరుపై సరికొత్త ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. ఉళ్లో ఉన్న వారిని వదిలేసి.. ఊరి నుంచి వెళ్లిపోయిన వారికి..గజ్వేల్.. హైదరాబాద్ లలో స్థిరపడిన వారికి ఇళ్లను కేటాయిస్తున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో భాగంగా తమ భూమిని తీసుకున్న అధికారులు.. చివరకు తమకు మాత్రం డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించటం లేదంటూ మండి పడుతున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం.. కేటాయింపులో ఏదైనా అవకతవకలు కానీ చోటు చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ దారుణంగా దెబ్బ తింటుందన్న విషయాన్ని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి దత్తత గ్రామంలోనూ వివక్ష.. పక్షపాతం ప్రదర్శించి.. లబ్థిదారుల ఎంపికలో తప్పులు జరిగితే.. దాని ప్రభావం తెలంగాణ రాష్ట్ర సర్కారు మీద ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. నర్సన్నపేటలో వెలుగు చూస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ఏదైనా తప్పు జరిగితే చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయాన్ని అధికారులు గుర్తిస్తే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News