రాశుల ఆధారంగా మొక్కలు నాటించాలంటున్న కేసీఆర్

Update: 2016-07-02 05:00 GMT
చిత్రమైన కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఆయన నమ్మకాల్ని.. జ్యోతిష్యాన్ని ఆధారంగా చేసుకొని ఎవరు ఏ మొక్క నాటితే బాగుంటుందోనన్న పద్ధతి ఎప్పటి నుంచో ఉందని.. తాజాగా ఇప్పుడా పద్ధతిని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటం విశేషం. ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్న రెండో విడత హరితహారంపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్.. జన్మ నక్షత్రం.. రాశుల ఆధారంగా మొక్కలు నాటించే పద్ధతి దేశంలో ఎప్పటి నుంచో ఉందని.. దాన్నే మళ్లీ తెర మీదకు తీసుకొచ్చినట్లుగా చెప్పుకొచ్చారు.

జన్మ నక్షత్రం.. రాశుల ఆధారంగా ఎవరు ఏ మొక్క నాటాలో పండితులు.. జ్యోతిష్యులు పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా ఆయన చెప్పారు. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కటి పంపిణీ చేసే సమయంలో జన్మ నక్షత్రం.. రాశుల్ని ఆధారంగా చేసుకొని మరీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నమ్మకాలు ఉండటం మామూలే అయినా.. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని జన్మ నక్షత్రాల్ని.. రాశుల ఆధారంగా నిర్వహించటం దేశంలో ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని.. మొక్కల పంపిణీ కార్యక్రమం ఇక అంత వీజీ కాకపోవచ్చు.

ఇకపై మొక్కల్ని పంపిణీ చేయాలంటే ముందుగా.. ప్రజల్ని కలిసి.. వారి జన్మనక్షత్రాలు..రాశుల వివరాలు సేకరించి.. వాటికి తగ్గట్లుగా మొక్కల్ని సేకరించి పంపిణీ చేయాల్సి ఉంటుందేమో..? కాకుంటే ప్రచార మాధ్యమాల ప్రకారం.. ఏ జన్మనక్షత్రానికి.. ఏ రాశి వారికి ఏ మొక్క సూట్ అవుతుందోనన్న విషయానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం షురూ చేసిన నేపథ్యంలో ప్రజలే ఎవరికి వారు తమకు కావాల్సిన మొక్కల్ని ఎంపిక చేసుకునే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా రాశుల ఆధారంగా మొక్కల పంపిణీ చేపట్టాలంటూ  కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించటమే కాదు.. ఇదో చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పుదు.

కేసీఆర్ చెబుతున్నా శాస్త్రం ప్రకారం ఏ రాశి వారు ఏ మొక్క పెంచాలన్నవిషయాన్ని చూస్తే..

రాశి                  మొక్క

మేషం                ఎర్రచందనం

వృషభం               ఏడాకుల పాయ

మిథునం              పనస

కర్కాటకం            మోదుగ

సింహం               కలిగుట్టు

కన్య                  మామిడి.. చూత

తుల                 పొగడ

వృశ్చికం             సండ్ర

ధనుస్సు             రావి

మకరం              జిట్టేగి

కుంభం              జమ్మి

మీనం               మర్రి

నక్షత్రం              మొక్క

అశ్విని              ముష్టి

భరణి                ఊసిరి

కృత్తిక               మేడి.. అత్తి

రోహిణి              నేరేడు

మృగశిర            నండ్ర

ఆరుద్ర              గుమ్మడి టేకు

పునర్వసు          వెదురు

పుష్యమి            రావి

అశ్లేష               నాగకేసరి

మఖ               మర్రి

పుబ్బ              మోదుగ

ఉత్తర               బండజువ్వి

హస్త                అడవి మావిడి

చిత్త                 మారేడు

స్వాతి               తెల్లమద్ది

విశాఖ              పులివెలుగ

అనూరాధ          పొగడ

జేష్ట                 తెల్లలొద్దుగ

మూల              మండదుంప

పూర్వాషాఢ        కనవ

ఉత్తరాషాఢ         పనస

శ్రవణ               జిల్లేడు

ధనిష్ట               జమ్మి

శతభిషం           కదంబం

పూర్వాభాద్ర        మామిడ.. చూత

ఉత్తరాభాద్ర         వేప

రేవతి               పెద్ద ఇప్ప
Tags:    

Similar News