ఆ ఒక్కటీ చేయలేకపోయానంటున్న కేసీఆర్

Update: 2016-03-13 10:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ తాను చెప్పిన హామీలన్నీ 99 శాతం అమలు చేశానని... ఒక్కటి మాత్రమే అమలు చేయలేకపోయానని అన్నారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా నీచ రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలపై విరుచుకుపడ్డారు. సభ్యులు మంచి సలహాలు ఇస్తారని ఆశించానని, సభ్యుల నుంచి గొప్ప సలహాలు, సూచనలు ఏం రాలేదని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని వి మర్శించారు. కేజీ టూ పీజీ తప్ప తాము 99శాతం హామీలను నెరవేర్చామని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వంటగ్యాస్‌ ధరలను తగ్గిస్తామని చెప్పి పెంచారని అన్నారు. రాష్ట్రంలో 16 శాతం అదనపు విద్యుత్‌ ను వి నియోగించబడుతోందని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారని, కాని తమ పాలనలో కరెంటు కోతల్లేకుండా సరఫరా చేస్తున్నామని అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాల కడుపు మండుతోందని కేసీఆర్‌ ఎదురుదాడికి దిగారు. విమర్శలు తప్ప విపక్ష నేతల నుంచి మంచి సూచనలు రాలేదని అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
Tags:    

Similar News