తెలంగాణ జల విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా టీ సీఎం కేసీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా ఆయన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై విపక్షాలను ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ వద్దంటే నీళ్లెలా వస్తాయో ప్రతిపక్ష నేతలే చెప్పాలని ప్రశ్నించారు. ఎస్సారెస్పీ ద్వారా నీటి ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయని, దేవుడు మన్నించి.. ప్రకృతి కరుణిస్తే తప్ప ఎస్సారెస్పీపై ఆశలు లేవన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుల రీడిజైనింగ్ అవసరం ఉందో లేదో సభ్యులే చెప్పాలన్నారు. గూగుల్ మ్యాప్ చూస్తే తాను చెప్పింది.. నిజమో కాదో తెలుస్తుందన్నారు. ఈ ఏడాది గోదావరి జలాలు ఆదుకున్నందునే హైదరాబాద్ కు నీళ్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం నుంచి 7 మండలాలు ఏపీకి వెళ్లిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేయాలా..? వద్దా.. సూటిగా ప్రశ్నించారు. అయితే... ఈ కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించడంతో కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కానీ, అడ్డం తగిలే వారు కానీ లేకపోయారు.
ఎస్ ఎల్ బీసీ ఎప్పటికి అవుతుంది?
సమైక్య పాలకులు ప్రారంభించిన ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు ఎన్నటికీ కూడా పూర్తయ్యే పరిస్థితిలేదని కేసీఆర్ అన్నారు. సొరంగం ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, మిషన్ లు భూమిని లోపలి నుంచి తవ్వుకుంటూ సొరంగం ఏర్పాటు చేస్తాయని వివరించారు. అటు నుంచి ఒక మిషన్ ఇటు నుంచి ఒక మిషన్ సొరంగం చేసూకుంటూ పోతాయని రెండు మిషన్లు కలిశాక మిషన్లను లోపలే డెడ్ చేసి అలాగే వదిలేస్తారని తెలిపారు. ఇప్పుడు కూడా తాను ఇంజినీర్లను అడిగినా ఇంకా రెండు మూడేండ్లలో పూర్తవుతుందని అంటున్నారని వివరించారు. టైగర్ వ్యాలీ ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టుకు అంతరాయంగా ఉందని తెలిపారు. ఈ ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు ఎన్నాళ్ల నుంచో జరుగుతుందన్నారు. ఇది ఎవరి పాపమని ప్రశ్నించారు. సమైక్య పాలకులు చేసిన అన్యాయం కాదా? అని నిలదీశారు. ఇది ఎప్పటికి పూర్తవుతందని అడిగారు.
కిన్నెరసాని ప్రాజెక్టు పరధిలో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందని.. పది కిలోమీటర్ల వరకు ఎకో జోన్ గా నోటిఫై చేశారని.. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు సిద్ధిస్తాయా అని ప్రశ్నించారు.