ఔను. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్‌ను ఫిదా చేసిన ఓ నాయకుడు, మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ షాకిచ్చారు. తనయుడి మాటను అనుసరించిన సదరు మంత్రి తక్షణమే తేరుకొని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఆసక్తిని రేకెత్తించే ఈ ఎపిసోడ్‌కు తెలంగాణ ఆర్టీసీ వేదిక అయింది. మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ఆర్టీసీ ఉమెన్ బయో టాయిలెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్ ఆన్ వీల్స్'ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉమెన్ బయో టాయిలెట్ బస్సులు గులాబీ రంగులో ఉండాలని నిర్ణయించారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బయో టాయిలెట్ బస్సులు గులాబీ రంగులోనే ఉంటాయని మంత్రి ఆదేశించారు. అయితే, దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మంలోని ఎస్సార్-బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఉమెన్ బయో టాయిలెట్స్ బస్సులను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్ ఆన్ వీల్స్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉమెన్ బయో టాయిలెట్ బస్సులు గులాబీ రంగులో ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారని, ఈ నేపథ్యంలో గులాబీ రంగులోనే ఉండాలని అన్నారు. అయితే, గురువారం ఉదయం రవాణా శాఖ మంత్రి అజయ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఉమెన్ బయో టాయిలెట్స్ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే బస్సుల రంగులు మార్చాలని అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.
మంత్రి కేటీఆర్ ఆదేశంతో వేసిన రంగులను అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో తిరిగి మార్చివేయడం ఆసక్తికరంగా మారింది. యువనేత ఆదేశాలను పాటించిన మంత్రి అజయ్ పార్టీ రథసారథి ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. రంగుల రచ్చ ఏపీ అంతటి సీరియస్‌గా మారకపోయినప్పటికీ ఇక్కడ కూడా తెరమీదకు వచ్చిందని తెలుస్తోంది.