తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గోల్కండ కోట అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన కార్యక్రమాల్ని గోల్కండ కోటలో నిర్వహించటం ద్వారా దానికి పూర్వ వైభవం తీసుకురావాలని తపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రానున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
జూన్ 2న తొలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరగనున్నందున భారీగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ సర్కారు రూ.20కోట్లు విడుదల చేస్తూ నిర్ణయంతీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఓరేంజ్‌లో నిర్వహించాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే భారీగా నిధులు విడుదల చేశారు. అంతేకాదు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని గోల్కండ కోటలో జరపాలని డిసైడ్ చేశారు.
తాజాగా నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా తీవ్రవాదాన్ని ఏ దశలోనూ ఉపేక్షించకుండా అణిచివేయాలన్న నిర్ణయంతో పాటు.. ఉగ్రవాద.. మావోల కారణంగా ప్రాణాలు కోల్పోయే పోలీసు సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా పెంచాలని నిర్ణయించారు.
కొత్తగా నాలుగువేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సానుకూలంగా నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కారు.. విద్యుత్.. పంచాయితీ రాజ్ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.