ప్రధాని మోడీ ఎంత వేగంగా రియాక్ట్ అవుతారన్న విషయం కోమటిబండ సాక్షిగా స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. అనుకోని రీతిలో ఒకప్పుడు తనను తిట్టిన కేసీఆర్ నోటి నుంచి.. తన సర్కారు పని తీరుపై ఎన్డీయే కూటమిలో లేని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఒక కాంప్లిమెంట్ ను గంటల వ్యవధిలో మోడీ రెండుసార్లు వాడేసిన వైనం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా పుష్కరానికి పైనే బండి నడిపిన కేసీఆర్.. నోరు జారిందంటూ ఉండదు. అలాంటి ఆయన.. ప్రధాని మోడీ తన ఇలాకాకు రావటం తనకెంత సంతోషాన్ని కలిగించిందన్న విషయాన్ని మాటల్లో చెప్పే క్రమంలో నోరు జారారా? తనలో సహజసిద్ధంగా ఉండే మాటల పొదుపు విషయంలో కాస్తంత తొందరపడ్డారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక భారీ పొగడ్త కేసీఆర్ నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. కోమటిబండలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ రెండేళ్ల పాలన విషయంలో ఏన్డీయేతర ముఖ్యమంత్రి ఎవరూ ఇవ్వని భారీ కాంప్లిమెంట్ ను భారీ జనసందోహం సాక్షిగా కేసీఆర్ ఇవ్వటం కనిపించింది.
మోడీ రెండేళ్ల పాలనలో అవినీతి మచ్చుకైనా కనిపించలేదన్న కాంప్లిమెంట్ కేసీఆర్ నోటి నుంచి వచ్చిన కాసేపటికే మాట్లాడిన ప్రధాని మోడీ.. ఆ విషయాన్ని చెప్పుకొని.. తమ ప్రభుత్వం ఎలా పని చేస్తుందన్న విషయాన్ని చెప్పుకున్నారు. అంతేకాదు.. కాసేపటి తర్వాత హైదరాబాద్ లో జరిగిన బీజేపీ మహా సమ్మేళన్ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించిన ప్రసంగించిన మోడీ.. కేసీఆర్ మాటల్ని ప్రస్తావిస్తూ.. ఎన్డీయేతర ముఖ్యమంత్రి కేంద్రంలో తమ సర్కారు పాలనను పొగిడేసిన విషయాన్ని ప్రస్తావించారు.
సార్వత్రి ఎన్నికల సమయంలో మోడీని ఉద్దేశించి ‘ఫాసిస్ట్’ అంటూ కేసీఆర్ కామెంట్ చేయటం తెలిసిందే. ఈ తీవ్ర విమర్శ మోడీని కదిలించిందన్న మాటను కమలనాథులు చెబుతుంటారు. ఎన్నికల వేళ తనను ఏ అధినేత అయితే పాసిస్ట్ గా సంబోధించారో.. అదే అధినేత తనను ఆకాశానికి ఎత్తేసేలా పొగిడేలా వ్యవహరించటంలో మోడీ సక్సెస్ అయితే.. భవిష్యత్తులో తాను చేసిన వ్యాఖ్యలు తనన వెంటాడతాయన్న చిన్న పాయింట్ ను మిస్ అవుతూ.. మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ కేసీఆర్ పొగడటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. మోడీ పాలన విషయంలో కేసీఆర్ కాంప్లిమెంట్ అవసరానికి మించిందని.. మోతాకు మించిమరీ పొగిడేసినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతుంటే.. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ తనను పొగిడిన కేసీఆర్ పొగడ్తను మోడీ పదే పదే వాడేస్తూ.. తమ మైలేజీని పెంచుకునే ప్రయత్నంలో మోడీ దూకుడుగా వ్యవహరించారని చెప్పాలి.