పొరుగు రాష్ట్రమైన ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముహూర్తం ఖరారు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలో విస్తరణ ఉంటుందా? గత కొద్ది కాలంగా వినిపిస్తున్న ఈ చర్చకు రాబోయే ఒకటి రెండు నెలల్లో గులాబీ దళపతి - సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మంత్రుల పనితీరు - ఎన్నికల ఎత్తుగడలు - కుల సమీకరణాల ఆధారంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
సీఎం కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టి అనంతరం మంత్రివర్గ కూర్పు తరువాత దాదాపు ఈ మూడు సంవత్సరాల కాలంలో భారీ మార్పులేమి జరగలేదు. ఒక్క ఉప ముఖ్యమంత్రిని మాత్రమే మార్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మినహా మంత్రివర్గంలో పదిహేడు మంది మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు మండలి నుంచి, 15 మంది మంత్రులు శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రివర్గంలో మహిళా ప్రాతినిధ్య లోటు కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ఈ విషయంలో టీఆర్ ఎస్ విమర్శలను కూడా ఎదుర్కుంది. శాసనసభ ఎన్నికలకు సుమారు రెండు సంవత్సరాల సమయం మాత్రమే ఉండడంతో గత కొంత కాలంగా మంత్రివర్గంలో తప్ప కుండా మార్పులు చేర్పులు ఉంటాయనే వాదన విన్పిస్తోంది.
ప్రస్తుత మంత్రివర్గం నుంచి ఏడుగురికి ఉద్వాసన ఉంటుందని, వారి స్థానంలో ఒక మహిళతో పాటు ఆరుగురికి కొత్తగా అవకాశం లభించవచ్చని అంటున్నారు. కొందరి మంత్రుల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అలాంటి వారికి అంతర్గత సమావేశాలలో ముఖ్య మంత్రి చురకలంటిస్తున్నారని వినికిడి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలో సీఎం కేసీఆర్ మార్పులు చేర్పులు చేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ ఎస్ ప్లీనరి - బహిరంగ సభ తర్వాత ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/