టీఆరెస్ లో నాయకులకు నిద్ర పట్టడం లేదట. ఒకేసారి 4 వేల పదవుల భర్తీకి రంగం సిద్దం కావడంతో పార్టీ నేతల ఆశలన్నీ అధినేతపైనే ఉన్నాయి. నేడో.. రేపో జాబితా బయటికి వచ్చే అవకాశం ఉండడంతో నేతలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సంస్థాగతంగా టీఆర్ ఎస్ ను పటిష్ట పరిచి.. క్యాడర్ ను కార్యోన్ముఖం చేయా లని నిర్ణయించిన ముఖ్యమంత్రి కెసిఆర్ పదవు లన్నీ భర్తీ చేయాలని నిర్ణయించడంతో క్యాడర్ లో దిగువ నుంచి పైస్థాయి వరకు ఫుల్ ఖుషీ నెలకొంది.
మొత్తం 31 జిల్లాల్లో పార్టీ అధ్యక్ష - కార్యదర్శులు - కార్యవర్గాలు - ఎస్టీఎస్సీ - బిసి - మైనారిటీ - రైతు - యువత - మహిళా - కార్మిక - విద్యార్ధి తదితర సంఘాల జాబితా ఇవ్వమని ఆదేశించిన సిఎం మంత్రులు - ఎమ్మెల్యేల నుండి వచ్చిన జిల్లా స్థాయి పదవుల ప్రతిపాదనల జాబితాలను స్వీకరించారు. జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించి.. ముఖ్యమంత్రి కెసిఆర్ కులాలు - సామాజికవర్గాల మధ్య సమతూకానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో.. దాదాపు అన్ని జిల్లాలకు కొత్త సారధులను నియమించే అంశంపై టీఆర్ ఎస్ అధినేత కెసిఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తిచేశారు. మంగళవారం లేదా.. ఒకటి - రెండు రోజుల్లో జాబితా విడుదల చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వీటిపై రాష్ట్ర భారీనీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు - ఐటీ శాఖామంత్రి కెటిఆర్ - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలతో చర్చించినట్లు సమాచారం.
ఒక్కో జిల్లాలో వందకు పైగా జిల్లా స్థాయి పదవులు గులాబీనేతలకు దక్కబోతున్నాయి. 31 జిల్లాల తెలంగాణలో.. దాదాపు 4వేల పదవులు ఒకేసారి.. వరించబోతున్నాయి. టీఆర్ ఎస్ ఆవిర్భావం తర్వాత నాలుగువేల పదవులు ఒకేసారి క్యాడర్ కు దక్కడం ఇదే ప్రధమం. పెద్ద జిల్లాల్లో అధ్యక్షుడు - ఉపాధ్యక్షుడు - నలుగురు ప్రధానకార్యదర్శులు - నలుగురు కార్యదర్శులతో పాటు మొత్తం 24మందితో జిల్లా కార్యవర్గం ఏర్పాటు కానుంది. వీటికి తోడు తొమ్మిది అనుబంధసంఘాలు ఎస్సీ - ఎస్టీ - బిసి - మైనారిటీ - మహిళ - రైతు - యువజన - కార్మిక - విద్యార్ధి సంఘాలకు సంబంధించి.. 90పదవులను భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన పెద్ద జిల్లాల్లో ఒకేసారి 114జిల్లా పదవులు గులాబీ నేతలకు దక్కబోతు న్నాయి. ఇక చిన్న జిల్లాల్లో జిల్లా కార్యవర్గంలో 15మంది - 9అనుబంధ సంఘాలకు సంబంధించి 90మందికి పదవులు దక్కనున్నాయి. అంటే చిన్న జిల్లాల్లో 105పదవులు వరించనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలపై ప్రకటన వెలువడవచ్చన్న సంకేతాలు కనబడుతున్నాయి. 150డివిజన్లున్న హైదరాబాద్ లో ఈసంఖ్య మారనుంది. మరోవైపు టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించకపోగా.. ఇపుడు దానిపై కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/