నారాయణ రెండు చెవులు కేసీఆర్ ప్రసాదమే

Update: 2016-02-06 06:12 GMT
కొంతమంది హవా కొన్నాళ్లు సాగుతుంది. కమ్యూనిస్ట్ ల వ్యవహారమే చూస్తే.. దేశంలో ఆదర్శవంతమైన రాజకీయాల్ని చేసే పార్టీగా గుర్తింపు పొందిన కమ్యూనిస్టులు ఈ మధ్య కాలంలో తమ పరపతి మొత్తాన్ని పోగొట్టుకోవటం తెలిసిందే. 1999 నుంచి దాదాపు 2010 వరకు వారి హవా బాగానే నడిచింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. ప్రజల్లో వారి పట్ల ఉన్న సానుకూలత మొత్తం మాయమవుతున్న పరిస్థితి.

గతంలో వారు కానీ పిలుపునిస్తే ఆగమాగమయ్యే పరిస్థితి. ఇప్పుడు అలాంటివేమీ చోటు చేసుకోవటం లేదు. ఇక.. కమ్యూనిస్ట్ నేతలపై ఉండే సానుకూలత రోజురోజుకీ కొడిగడుతున్న పరిస్థితి. 2009 నుంచి మొదలైన వారి డౌన్ ఫాలో రోజులు గడుస్తున్న కొద్దీ వారి పరపతి మరింత దిగజారుతోంది. అందుకు తగ్గట్లే సదరు నేత వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. గతంలో ప్రజాసమస్యల మీద పోరాడే కమ్యూనిస్టులు.. తర్వాత సమాజంలో వచ్చిన మార్పును గుర్తించటంలో ఫెయిల్ కావటంతో వారికి ఆదరణ తగ్గుముఖం పట్టింది.

జమానాలో చెప్పిన మాటల్ని ఈ జమానాలో చెప్పటం వారి ఫెయిల్యూర్ కి కారణంగా చెప్పొచ్చు. తొందరపాటు.. మిగిలిన రాజకీయ పక్షాలకు తీసిపోని విధంగా మాటల దాడి లాంటి విషయాల మీద దృష్టి పెట్టే నారాయణ లాంటి నేతల పుణ్యమా అని కమ్యూనిస్టుల మీద ఉన్న గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. ఇక.. రాఘవులు లాంటి నేత.. కీలకమైన విభజన లాంటి అంశాల మీద ఆయన అనుసరించిన విధానం.. మరికొన్ని తప్పులతో ఆయన పరపతి కొడిగట్టింది. తాజాగా గ్రేటర్ ఎన్నికల సందర్భంగా సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను.. ఆయన పార్టీని జోకర్ గా మార్చేశాయి. నిజానికి ఇలాంటి ఇమేజ్ కు జనం కంటే కంటూ సమయం చూసి మరీ దెబ్బ కొట్టే అలవాటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పదు.

గ్రేటర్ లో సొంత బలంతో కొలువు తీరే అవకాశం వస్తే.. తాను చెవి కోసుకుంటానని నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన మాటల్ని ఎవరెంత సీరియస్ గా తీసుకున్నా.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా.. గ్రేటర్ మీద గులాబీ జెండా ఎగరటం ఖాయమని.. అదెంత సింఫుల్ అన్న విషయాన్ని చెప్పిన కేసీఆర్.. పనిలో పనిగా నారాయణ శపధాన్ని ప్రస్తావించి.. ఫిబ్రవరి 5 సాయంత్రం నారాయణ హైదరాబాద్ లో ఉండకపోతే మంచిదని.. ఎందుకంటే తాము ఘన విజయం సాధించిన తర్వాత ఎవరైనా ఒకరు నారాయణ చెవి కోసే ప్రమాదం ఉందంటూ ఆయన సవాల్ ని కామెడీ కామెడీ చేయటం తెలిసిందే.

కేసీఆర్ చెప్పినట్లే తాజాగా వెలువడిన గ్రేటర్ ఫలితాలు చరిత్ర సృష్టించేలా ఉండటమే కాదు.. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు తిరుగులేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. చారిత్రక విజయాన్ని సాధించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. నారాయణ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి.. ఎన్నికల సమయంలో ఒకట్రెండు మాటలు అనుకుంటాం కానీ.. అలాంటిదేమీ చేయకూడదని.. స్పోర్టివ్ గా తీసుకోవాలని.. ఎవరూ నారాయణ జోలికి వెళ్లొద్దంటూ ఆయన పదే పదే చెప్పారు.

తొందరపడి నారాయణ మాట జారితే.. ఆయన మాటను కామెడీగా మార్చటమే కాదు.. తన సత్తా చాటి.. నారాయణతో పాటు.. ఆయన పార్టీ పరువును కూడా కేసీఆర్ క్వశ్చన్ మార్క్ పెట్టారన్న విషయాన్ని మర్చిపోకూడదు. తనంతట తానే చెవి కోసుకుంటానని సవాలు విసిరిన నారాయణను.. అలాంటి పని చేయొద్దని.. ఒక చెవి నారాయణను చూడలేనంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నారాయణ ఏం మాట్లాడగలరు. మరే విధంగా రియాక్ట్ కాగలరు. అందుకే.. మాట మాట్లాడేటప్పుడు వెనుకా ముందు చూసుకోవాలని చెప్పేది.
Tags:    

Similar News