కేసీఆర్ కీలక నిర్ణయం ...వారికీ మాత్రమే రైతుబంధు!

Update: 2020-05-13 08:30 GMT
తెలంగాణ లో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన అద్భుతమైన పథకాలలో రైతు బంధు కూడా ఒకటి. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతులందరికీ ఈ రైతుబంధు ద్వారా సాయం చేస్తున్న విషయం తెలిసిందే. పంట,పెట్టుబడి సాయంగా ప్రతి పంటకి ఐదువేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తూ రైతులందరికీ అండగా నిలుస్తోంది. అయితే, ఇప్పటికే పలు దఫాలు కు సంబంధించిన రైతుబంధును రైతులు తమ ఖాతాలో జమ కాగా వాటిని తీసుకున్నారు.

అయితే , ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతుబంధు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రైతులు మీకు ఇష్టమైన పంటను కాకుండా ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు వేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పంట పండిస్తే గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోవాల్సి వస్తుందని, దీనితో ప్రభుత్వం చెప్పిన పంటల్నే రైతులు వేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు పంటలు వేసి మార్కెట్‌కు తీసుకొస్తే ఎవరూ కొనబోరని స్పష్టం చేశారు.

ఈ తరుణంలోనే ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని, ఆ పంటలనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అందరూ ఒకే పంట వేస్తే గిట్టుబాటు ధర రాక రైతులు నష్ట పోవాల్సి వస్తుందని... అందుకే ప్రభుత్వం సూచించిన విధంగా మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టుగా రైతులు పంటలు వేయాలి అని సీఎం సూచించారు.

ఈ ఏడాది వరితోనే పంట మార్పు కావాలి అంటూ తెలిపారు. ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడంతోపాటు 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలి అంటూ సూచించారు. ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి విత్తనాల్ని మాత్రమే అమ్మాలని ఇందుకోసం కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
Tags:    

Similar News