తెలంగాణలో అధికార పక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ సమావేశాలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 27న హైదరాబాద్ శివారు కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్ లో ప్లీనరీ నిర్వహిస్తున్న ప్రాంతానికి ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేశారు. టీఆర్ ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి చేసిన ఉద్యమం, సాధించిన రాష్ట్రం.. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయనే విషయాన్ని అన్ని రాష్ర్టాలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ఎందుకంటే ఇదే సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించి ఈ ఆసక్తిని సృష్టించారు కాబట్టి. అయితే కేసీఆర్ ముందున్న తక్షణ కర్తవ్యం పార్టీ బలోపేతం అని అంటున్నారు.
రాజకీయ విశ్లేషకులు రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ కే పట్టం అనే అంచనాపై భిన్నాభిప్రాయాలతో ఉన్నప్పటికీ....అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల తుఫాను టీఆర్ ఎస్ ను తిరిగి గద్దెనెక్కిస్తుందని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటున్నందున జనమంతా తమ వైపే ఉన్నారని - ఎన్నికల వేళ కూడా లెక్క తప్పదని కేసీఆర్ లెక్క. అయన మాటలు - వ్యవహార శైలి - కార్యాచరణను బట్టి ఈ విషయం తెలుసుకోవచ్చు. తాము 106 అసెంబ్లీ సీట్లు గెలుచుకోబోతున్నట్టు ఇటీవలి కాలంలో ఆయన చాలా సార్లు చెప్పారు. సర్వేలన్నీ టీఆర్ ఎస్ కు పట్టం కడుతున్నట్టు చెబుతున్నారు. ఇక విపక్షాల విషయానికి వస్తే...తెలంగాణలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ ను బహునాయకత్వం లేదా సమర్థ నాయకత్వ లేమి పీడిస్తున్నంత కాలం ఆ పార్టీని ఎవరూ రక్షించలేరనే భావన ఉంది. మిగతా పార్టీలు గట్టిపోటీని ఇచ్చే పరిస్థితి లేదు.
అయితే టీఆర్ ఎస్ విజయం అంత ఈజీ కాదని అంటున్నారు. ఎందుకంటే 2014 తర్వాత దాని స్వరూపం ఇంకా మారిపోయింది. కాంగ్రెస్ - తెలుగుదేశం - సీపీఐ - వైసీపీ తదితర పార్టీల నుంచి వచ్చిన నాయకులు - కార్యకర్తలతో టీఆర్ ఎస్ హౌస్ ఫుల్ అయింది. ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేయడంలో, వాళ్లకు సరైన ఎజెండా లేకుండా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అదొక్కటే అధికారపక్షాన్ని అందలమెక్కించే వ్యూహం అనుకుంటే పొరపాటేనన్న భావన పార్టీ శ్రేణులలో ఉంది. పార్టీ గొప్పదా, ప్రభుత్వం గొప్పదా అని కేసీఆర్‌ను అడిగి చూడండి. పార్టీయే గొప్పదని ఆయన గ్యారంటీగా చెబుతారు. కానీ గడచిన నాలుగేళ్ళుగా ఆయన పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే అంశాన్ని విస్మరించారనే నింద పార్టీ శాసనసభ్యుల నుంచే ఉన్నది. అది నిజం కాకపోవచ్చును. పార్టీ నిర్మాణాన్ని కూడా ఇలా ఉంచడంలోనే ఆయన బలమైన వ్యూహం దాగి ఉండవచ్చును. టీఆర్ ఎస్ నిర్మాణం సంస్థాగతంగా డొల్లగా ఉందన్న విషయం కేఈఆర్‌కు తెలియదని అనుకుంటే అమాయకత్వమేనని అయితే ఆయన ఇన్నాళ్లు దృష్టిపెట్టకపోవడంలో కూడా వ్యూహాలు ఉన్నాయంటున్నారు. ఈ ప్లీనరీ వేదికగా ఆ ప్రయత్నం చేయకపోతే పార్టీకి కష్టకాలమేనని చెప్తున్నారు.