తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ బలమెంత?

Update: 2016-03-11 04:30 GMT
తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో అంకెలు తారుమారయ్యాయి. బలాబలాల లెక్కల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నమొన్నటివరకూ అధికార విపక్షాల మధ్య అంతరం ఓ మోస్తరుగా ఉంటే.. ఇప్పుడు అందుకు భిన్నం. అధికార.. విపక్షాలకు మధ్య అంతులేని దూరం పెరిగిపోవటమే కాదు.. అధికారపక్షాన్ని అందుకోవటం ఎవరికి సాధ్యం కాదన్నట్లుగా ఉండటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి షురూ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ తో తెలంగాణ అసెంబ్లీలో పార్టీల వారీగా బలాల లెక్కల్లో తేడాలొచ్చేశాయి. తాజాగా తెలంగాణ స్పీకర్ .. తెలంగాణ టీడీపీ నుంచి తెలంగాణ అధికారపక్షంలోకి వచ్చిన ఎమ్మెల్యేల్ని టీఆర్ ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవటంతో అధికారపక్షం బలం భారీగా పెరిగిపోయింది. తాజాగా చోటు చేసుకున్న మార్పులతో.. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ బలం ఎంతంటే..

టీఆర్ ఎస్        85
కాంగ్రెస్           15
మజ్లిస్             7
 బీజేపీ             5
టీడీపీ              3
వైఎస్సార్ కాంగ్రెస్  1
సీపీఎం              1
సీపీఐ                1
స్వతంత్రులు         1

= నామినేటెడ్ ఎమ్మెల్యేను టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఖాతాలో వేయటం జరిగింది

= టీడీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు పేర్కొన్నా.. ఆర్. కృష్ణయ్య టీడీపీతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు

= కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంరెడ్డి వెంకట్రెడ్డి మరణం కారణంగా పాలేరు స్థానం ఖాళీ అయ్యింది

= ఎన్నికల ఫలితాల అనంతరం టీటీడీపీ మూడో పెద్ద పార్టీగా ఉంటే.. ఆపరేషన్ ఆకర్ష్ అనంతర పరిణామాలతో నాలుగో స్థానానికి దిగజారింది
Tags:    

Similar News