గత కొద్దికాలంగా తెలంగాణలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. సర్కారు తీరును దుయ్యబడుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా తెలంగాణ సీఎం ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. పలు సూచనలు, నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గత కొద్దికాలంగా ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ చేయడం, ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేవని ప్రకటించడం వంటి అంశాలపై సీరియస్ అయ్యారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉందని పేర్కొన్న కేసీఆర్ తెలంగాణలోనే లేదు, తెలంగాణలో పుట్టలేదనే విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు.
కరోనా వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధం చేశామని, అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించినట్లు సీఎం తెలిపారు. 'ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు` అంటూ కేసీఆర్ ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.