ఆ 20 మంది ఓట‌మే కేసీఆర్‌ కు కావాల‌ట‌!

Update: 2018-07-06 08:54 GMT
షెడ్యూల్ ప్ర‌కారం చూస్తే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ప‌ది నెల‌ల టైముంది.కానీ.. కేంద్రంలోని మోడీ కార‌ణంగా ముంద‌స్తు ఎన్నిక‌ల దిశ‌గా అడుగులు వేస్తున్న ప‌రిస్థితి. అంత‌కంత‌కూ త‌గ్గుతున్న ఇమేజ్ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్ని ఎంత త్వ‌ర‌గా పూర్తి అయితే అంత త్వ‌ర‌గా పూర్తి చేసుకుంటే అధికారం మ‌రోసారి సొంతం చేసుకోవాల‌న్న‌ది మోడీ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం మోడీ బాట‌లో ప‌య‌నించాల‌ని భావిస్తున్నారు. ఇటీవ‌ల తాను అమ‌లు చేసిన రైతుబంధు ప‌థ‌కంతో రాష్ట్రంలో త‌మ పాల‌న విష‌యంలో సానుకూలంగా ఉన్న‌ట్లుగా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే.. ఆల‌స్యం కాకుండా.. వాతావ‌ర‌ణం త‌మ‌కు అనుకూలంగా ఉన్న వేళ‌.. ఎన్నిక‌లు జ‌రిగితే మంచిద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు.

ఇప్ప‌టికే చేయించిన ప‌లు స‌ర్వే నివేదిక‌లు టీఆర్ ఎస్ గెలుపు ప‌క్కా అని చెబుతున్న వేళ‌.. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోకుండా ఆచితూచి అడుగులు వేస్తూ.. తెలంగాణ‌లో త‌మ పాల‌నా ప‌గ్గాల్ని మ‌రోసారి చేప‌ట్టాల‌న్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. దీనికి త‌గ్గట్లే ఆయ‌న ప‌క్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

త‌దుప‌రి ఎన్నిక‌ల త‌ర్వాత విప‌క్ష‌మే అన్న‌ది లేకుండా ఉండాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌గా చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే ఇటీవ‌ల కాలంలో ఆయ‌న మాట‌లు అందుకు త‌గ్గ‌ట్లే ఉండ‌టం గ‌మ‌నార్హం.

త‌మ‌కు 100కు పైగా సీట్లు ఖాయ‌మ‌ని.. కాంగ్రెస్ నాలుగైదు స్థానాలు కూడా ద‌క్క‌కూడ‌ద‌ని.. బీజేపీ అయితే ఏకంగా ఖాతానే ప్రారంభించ‌కూడ‌ద‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ఉన్నారు.దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న వ్యూహం సిద్ధం చేశారు. త‌మ‌కు ఇబ్బంది క‌లిగించే విప‌క్ష నేత‌ల‌కు సంబంధించి 20 మంది పేర్ల‌ను కేసీఆర్ రెఢీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. విపక్షాల‌కుచెందిన ముఖ్య‌నేత‌ల ఓట‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్న‌ట్లుగా ఆయన వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. తాను సిద్ధం చేసిన 20 మంది ఓట‌మిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్లే ఒక జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్‌.. స‌ద‌రు నేత‌ల తీరుపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించ‌టం.. వారికి సంబంధించిన అన్ని అంశాల పైనా దృష్టిపెట్ట‌ట‌మే కాదు.. వారిని ఓడించ‌టానికి అవ‌స‌ర‌మైన అస్త్ర శ‌స్త్రాల్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంత‌కీ ఆ 20 మంది ఎవ‌ర‌న్న‌ది చూస్తే.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్న నేత‌ల్ని చూస్తే

1. జానారెడ్డి - నాగార్జునసాగర్‌
2. ఉత్తమ్‌కుమార్‌- హుజూర్‌ నగర్‌
3. పద్మావతి- కోదాడ
4. కోమటిరెడ్డి- నల్లగొండ
5. మల్లు భట్టి విక్రమార్క- మధిర
6. జీవన్‌ రెడ్డి- జగిత్యాల
7. రామ్మోహన్‌రెడ్డి- పరిగి
8. డీకే అరుణ- గద్వాల
9. వంశీచంద్‌ రెడ్డి- కల్వకుర్తి
10. సంపత్‌ కుమార్‌- అలంపూర్‌
11. రేవంత్‌ రెడ్డి- కొడంగల్‌
12. దొంతి మాధవరెడ్డి- నర్సంపేట
13. సండ్ర వెంకటవీరయ్య- సత్తుపల్లి
14. గీతారెడ్డి- జహీరాబాద్‌
15. లక్ష్మణ్‌- ముషీరాబాద్‌
16. జి.కిషన్‌ రెడ్డి- అంబర్‌పేట
17. రామచంద్రారెడ్డి- ఖైరతాబాద్‌
18. ఎన్వీఎస్‌ ఎస్‌ ప్రభాకర్‌- ఉప్పల్‌
19. రాజాసింగ్‌- గోషామహల్‌
20. సున్నం రాజయ్య- భద్రాచలం
Tags:    

Similar News