డేంజ‌ర్ జోన్లో 39 మంది గులాబీ ఎమ్మెల్యేలు?

Update: 2018-06-07 04:57 GMT
గ‌తానికి భిన్న‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఎన్నిక‌ల ముందు మాత్ర‌మే కాదు.. ఎన్నిక‌ల‌కు బోలెడంత టైం ఉండ‌గానే..త‌మ పార్టీ నేత‌ల ప‌నితీరు ఎలా ఉంది?  ప్ర‌జ‌ల్లో వారికి ఉన్న ప‌లుకుబ‌డి ఎంత‌? అన్న అంశాల‌తో నేత‌ల ప్రొగ్రెస్ రిపోర్ట్ ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్ చేయ‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది.

త‌ర‌చూ స‌ర్వేలు చేయించ‌టం.. నేత‌ల‌ ప‌ని తీరుతో పాటు.. వారికున్న ఇమేజ్ ను మ‌దింపు చేయ‌టం.. వారికి ర్యాంకుల్ని క‌ట్ట‌బెట్టటం ఇప్పుడు కామ‌న్ గా మారింది. తాజాగా చేయించిన స‌ర్వే రిపోర్ట్ సీఎం చేతిలో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో టీఆర్ ఎస్ కు చెందిన 39 మంది ఎమ్మెల్యేల ప‌ని తీరు బాగోలేద‌ని.. వారిని కానీ ఎన్నిక‌ల గోదాలో దించితే ఎదురుదెబ్బ త‌ప్ప‌ద‌న్న‌ట్లుగా రిపోర్ట్ వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

డేంజ‌ర్ జోన్లో ఉన్న వారిలో ప‌లువురు మంత్రులు కూడా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. దీంతో.. క‌ష్టాల్లో ఉన్న నేత‌ల‌కు ముఖ్య‌మంత్రి స్వ‌యంగా ఫోన్ చేసి.. వారికి వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.  డేంజ‌ర్ జోన్లో ఉన్న 39 మంది నేత‌ల్లో కొంద‌రితో కేసీఆర్ స్వ‌యంగా మాట్లాడితే.. మ‌రికొంద‌రి బాధ్య‌త‌ల్ని కేటీఆర్.. మంత్రి హ‌రీశ్‌ల‌కు అప్ప‌జెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

పార్టీకి ఆద‌ర‌ణకు ఢోకా లేద‌ని.. ఎమ్మెల్యేల ఆద‌ర‌ణే పార్టీకి ఇప్పుడు ఇబ్బందిగా మారిన‌ట్లుగా చెబుతున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌కు చెందిన ప‌లువురు సీనియ‌ర్లు ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న‌ట్లుగా స‌ర్వే నివేదిక వెల్ల‌డించిన‌ట్లుగా స‌మాచారం. దీంతో.. డేంజ‌ర్ జోన్లో ఉన్న 39 మందికి హెచ్చ‌రిక‌లు జారీ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిందేదో జ‌రిగింద‌ని.. ఇక‌పై అలాంటి ప‌రిస్థితి లేకుండా చేసుకోవాల‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.  

ఒక‌వేళ ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితుల్లో మార్పు లేనట్లైయితే.. క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. డేంజ‌ర్ జోన్లో ఉన్న 39 మంది నేత‌లు త‌మ ప‌ని తీరును వెంట‌నే మార్చుకోవాల‌ని.. లేనిప‌క్షంలో ఎన్నిక‌ల నాటికి వారిని ఎవ‌రూ కాపాడ‌లేర‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లుగా స‌మాచారం.

2019 ఎన్నిక‌ల్లో వంద సీట్ల‌కు త‌గ్గ‌కుండా ఎమ్మెల్యేల్ని సొంతం చేసుకోవాల‌ని భావిస్తున్న కేసీఆర్‌కు తాజా నివేదిక ఆగ్ర‌హానికి గురి చేసిన‌ట్లుగా చెబుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో 63 అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకున్న కేసీఆర్‌.. ఆ త‌ర్వాత కాలంలో వ‌చ్చిన రెండు ఉప ఎన్నిక‌ల్లోనూ గులాబీ పార్టీ గెలుసుకుంది. త‌ర్వాతి కాలంలో టీడీపీకి చెందిన 12 మంది.. కాంగ్రెస్ కు చెందిన ఏడుగురు.. వైఎస్సార్ కాం్రెస్‌కు చెందిన ముగ్గురుతోపాటు.. బీఎస్పీకి చెందిన ఇద్ద‌రు.. సీపీఐకి చెందిన ఒక‌రిని గులాబీ కారు ఎక్కించేశారు. దీంతో టీఆర్ఎస్ బ‌లం 90కు చేరుకుంది.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప‌థ‌కాల్ని తెర మీద‌కు తెస్తున్న కేసీఆర్‌.. త‌మ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో పూర్తిస్థాయి సంతృప్తి ఉన్న‌ట్లుగా ఫీల‌వుతున్నారు. అయితే.. గ్రౌండ్ లెవ‌ల్లో ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉన్న వైనం వెలుగు చూసింది. ప్ర‌జ‌ల్లో పార్టీపై సానుకూల‌త ఉన్నా.. నేత‌ల‌పై ప్ర‌తికూల‌త ఉండ‌టాన్ని సీరియ‌స్ గా తీసుకున్న కేసీఆర్‌.. త‌మ ప‌నితీరును మెరుగుప‌ర్చుకోవాల‌ని ఆదేశాలుజారీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా రైతుబంధు ప‌థ‌కాన్ని తాము అమ‌లు చేస్తున్న‌ట్లుగా చెప్పుకుంటున్న కేసీఆర్‌.. ఈ ప‌థ‌కం త‌ర్వాత టీఆర్ఎస్ ప్ర‌భుత్వ గ్రాఫ్ ప్ర‌జ‌ల్లో భారీగా పెరిగిన‌ట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన  చేయించిన స‌ర్వే రిపోర్ట్ విస్మ‌య‌క‌ర అంశాల్ని బ‌య‌ట‌పెట్టింద‌ని స‌మాచారం. దీంతో.. ఆయ‌న వెంట‌నే రియాక్ట్ అయి.. ప‌ని తీరు బాగోలేని నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్ఉల‌గా చెబుతున్నారు.

కేసీఆర్ చేతికి అందిన నివేదిక‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్న షాకింగ్ అంశాల్ని చూస్తే..

+ టీఆర్ ఎస్ లో ఉన్న 90 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది డేంజ‌ర్ జోన్లో ఉన్నారు

+ త‌మ‌కు తిరుగులేద‌నుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితి షాకింగ్ గా ఉన్నాయి.

+ ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌వి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం

+ కొంద‌రు ఎమ్మెల్యేల ప‌నితీరుపై వివిధ కార‌ణాల‌తో పార్టీ శ్రేణులు.. స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు.. ఉద్యోగులు.. త‌ట‌స్తులు ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తేలింది

+ పార్టీకి ఉన్న ఆద‌ర‌ణ‌తో పోలిస్తే.. పలువురు ఎమ్మెల్యేల‌కు స‌గం కూడా ఇమేజ్ లేద‌ని తేలింది.

+ మ‌రో ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో వ్య‌తిరేక‌త ఉన్న ఎమ్మెల్యేలు త‌మ ఇమేజ్ ను పెంచుకోవాల్సి ఉంటుంది. లేని ప‌క్షంలో ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చే విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Tags:    

Similar News