ఆర్టీసీ సమ్మె చేయిదాటిపోయింది. ఇప్పుడు కేసీఆర్ వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేరు. అలా అని పరిష్కరించే యోచనలో కూడా లేడు. పంతానికి పోయి ఆర్టీసీ కార్మికులు, కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీని ఖతం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది.
అయితే ఆర్టీసీ ఉద్యోగులకు పరోక్ష మద్దతునిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై ఉడికిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులను కూల్ చేసేందుకు కేసీఆర్ నడుంబిగించారు. ఆర్థిక మాంద్యం వెంటాడుతున్నా.. రాష్ట్రం అప్పుల కుప్పలతో కుదేలవుతున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళితే కొంపలు అంటుకుంటాయి. అందుకే ముందుగానే పీఆర్సీ ప్రకటించేందుకు రెడీ అయ్యారు.
పీఆర్సీతో ఉద్యోగులు జీతాలు పెరగడంతోపాటు వారికి వచ్చే ఫిట్ మెంట్ కూడా ప్రకటించనున్నారు. దీంతో ఆర్టీసీ సమ్మెతో పోరుబాట పట్టేందుకు ఆలోచిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఇలా జీతాలు పెంచి సంతృప్తి పరచడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు.
ఇప్పటికే ఆర్టీసీ మంటలు రాష్ట్రంలో ఆరడం లేదు. ఇప్పుడు ఎంతో కాలంగా రగిలిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా రగిలిపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు పీఆర్సీని తెరపైకి తెస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.