విపక్షం అంటే విమర్శించటం. ప్రజాస్వామ్యంలో ఇది కామన్. ఇప్పుడు తిరుగులేని అధికారపక్షంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ సైతం గతంలో విపక్షమే. ఆ సందర్భంలో వారెలా వ్యవహరించారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితి కూడా లేదు. అందుకేనేమో.. విపక్షం ఎలా ఉండాలో ఆయన చెప్పేశారు. అదే సమయంలో తన మీద విమర్శలు సంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు ఉడికిపోయారు. తనకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరూ చేయని వేళ.. అంతో ఇంతో నిజాలు చెప్పే దమ్ము.. ధైర్యం పట్టుమని పది మంది కూడా విపక్ష సభ్యులకు ఉండటం సారుకు సుతారం ఇష్టం లేదన్న విషయాన్ని తనదైన శైలిలో చెప్పేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ సర్కారు తీరును తీవ్రస్థాయిలో వేలెత్తి చూపించి.. దుమ్ము దులిపే ప్రయత్నం చేశారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వనిదే.. ఓట్లు అడగమని.. ముఖం చూపించమని దాదాపు నాలుగేళ్ల క్రితం చెప్పిన మాటల్ని.. ఇప్పుడు గుర్తు చేస్తే ఎవరికి మాత్రం కోపం రాదు. ఇంటింటికి నల్లా నూటికి ముప్ఫై శాతమేనన్న రాజగోపాల్ మాటలకు కేసీఆర్ వేసిన కౌంటర్ ను చూసినప్పుడు.. ‘‘ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు పిచ్చి కూతలు కూసిన ఆ వ్యక్తి నియోజకవర్గంలోనే 334 గ్రామాలకు నీళ్లు అందాయి. నీరు ఉందని ఇష్టమొచ్చినట్లు అరుస్తామంటే ఏమిటిది?’’ అంటూ ఫైర్ అయ్యారు.
కేసీఆర్ మాటల్ని సునిశితంగా విన్నప్పుడు ఆయన మేథోతనానికి.. తెలివికి ముచ్చట పడాల్సిందే. నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఎన్ని ఇళ్లు ఉన్నాయి? వాటిలో ఎన్ని గ్రామాలకు.. ఎన్ని ఇళ్లకు ఇప్పటివరకూ నీళ్లు ఇచ్చామన్న మాటను చెప్పకుండా.. తనకు అనుకూలమైన గణాంకాల్ని ప్రస్తావించిన వైనానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే.
తనను.. తన ప్రభుత్వాన్ని తీసి పారేసినట్లుగా వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి తీరుకు కేసీఆర్ కు చాలానే కోపం వచ్చిన వైనం.. ఆయన మాటల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సభ నుంచి సస్పెన్షన్ చేయాలన్న తీవ్ర ఆలోచనలో ఉన్నట్లుగా తెలంగాణ సీఎం మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు అనివార్యమన్న విషయాన్ని తన వ్యాఖ్యలతో కేసీఆర్ సంకేతాలు ఎలా ఇచ్చారన్నది చూస్తే.. ‘‘ఇంత దుర్మార్గంగా మాట్లాడే వ్యక్తులు సభలో ఉండవచ్చునా? తీసి అవతల పారేద్దామా? ఎక్కడో ఒక చోట చురుకు తగలాలి. గతంలో గవర్నర్ మీదకు వీళ్ల అన్ననే మైకు విసిరేస్తే బహిష్కరించాం. దెబ్బ కొట్టకపోతే కుదరదు. ఈ ఆరాచకం మంచిది కాదు’’ అన్న కేసీఆర్ మాటల్ని చూస్తే.. తీవ్రమైన నిర్ణయం తప్పదన్న భావన కలుగక మానదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను విమర్శించాలి కానీ.. ఆయన హర్ట్ అయ్యేలా.. నొచ్చుకునేలా విమర్శలు ఉండకూడదన్న విషయాన్ని రాజగోపాల్ మర్చిపోవటాన్ని సారు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెప్పక తప్పదు.