భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. భావిష్యత్ కార్యాచరణ కోసం తన నియోజకవర్గంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా తన అభిమానులు శ్రేయోభిలాషులతో మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ఎన్నారైలతోనూ ఆయన వర్చువల్ గా సమావేశమయ్యారు.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎన్నారై సెల్ తాజాగా క్రీలక ప్రకటన చేసింది. ఎన్నారైలతో ఈటల సమావేశం విడ్డూరం అని ఎద్దేవా చేసింది. తెలంగాణ ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం ప్రకటించారు.
అమెరికాలోని కొంతమంది ఎన్నారైలతో ఈటల రాజేందర్ జూమ్ ద్వారా సమావేశమైనట్లు తెలిసిందని.. వారంతా నిన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారేనని ఆయన తెలిపారు.
ఈటల 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కమాట సాయం చేయని వారు సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈటలతో సమావేశమైన ఎన్నారైలను పలువురు చూసి నవ్వుకుంటున్నారని అనిల్ పేర్కొన్నారు.