దేశంలోని ముఖ్యమంత్రులందరితో కలిపి సమీక్ష చేసిన సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ముఖానికి మాస్కు పెట్టుకోవటం తెలిసిందే. అనారోగ్యంతో ఉన్న వారు మాస్కు ధరిస్తే సరిపోతుందన్న ప్రచారం మొదట్నించి సాగుతున్నదే. అందుకు భిన్నంగా నాలుగైదు రోజుల నుంచి ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలన్న మాటను చెప్పటమే కాదు.. మాస్కు లేకుండా ఇంట్లో నుంచి బయటకు వస్తే వారిపై కేసులు పెట్టేలా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
ప్రధానమంత్రి మాస్కు పెట్టినా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. పలువురు సీఎంలు మాస్కులు పెట్టింది లేదు. అలాంటిది సోమవారం ఉదయం కరోనాపై సమీక్షకు హాజరైన సీఎం సారు.. ముఖానికి మాస్కు పెట్టేసుకొని రావటం ఆసక్తికరంగా మారింది. అందరిలోనూ చర్చ స్టార్ట్ అయ్యేలా చేసింది. ముఖానికి మాస్కు పెట్టుకునేందుకు ఆసక్తిని చూపించని కేసీఆర్.. తాజాగా తన ఇష్టానికి భిన్నంగా ఎందుకు వ్యవహరించినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
చేతలతో ప్రజలకు సందేశం ఇవ్వటంతో పాటు.. మాస్కు ప్రాధాన్యత ప్రజలకు తెలియజేసేందుకే కేసీఆర్ అలా చేసి ఉంటారని చెబుతున్నారు. అదేమీ కాదు.. మారిన పరిస్థితులు.. ముప్పు ఎక్కువైనందునే మాస్కులు ధరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే ముఖానికి మాస్కు పెట్టుకోవటం ద్వారా ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందని చెప్పక తప్పదు. కానీ.. ఆ పనేదో మొదటే చేసి ఉంటే మరింత బాగుండేది సారూ.