కొన్నాళ్ల కిందట.. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించారు. అక్కడ రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు చెందిన కుటుంబాలకు ఆయన పరిహారం అందించా రు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా.. కూడా కేసీఆర్ లెక్క చేయలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి పంపిణీకి చర్యలు ప్రారంభించారు.
రేపు(బుధవారం) బిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన చేయనున్నారు. గాల్వాన్ లోయల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నారు.
కేసీఆర్ ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి పాట్నా బయలుదేరి వెళ్తారు. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బిహార్‌కు చెందిన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తారు.
ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థికసాయం అందించనున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేస్తారు.
శాసన సభపై చర్యలు
సెప్టెంబర్ 3న రాష్ట్ర మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఈ భేటీలో శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. కేబినెట్ సమావేశాలు నిర్వహించే తేదీలు ఖరారు చేయనున్నారు. వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్ ఓ నిర్ణయానికి రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.