కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో బలంగా జరుగుతోన్న ఒక ప్రచారం కొత్త మలుపు తీసుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్నికేటీఆర్ కు అప్పగించి తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే యోచనలో ఉన్నారన్న ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే కేటీఆర్ ను ఈసారి మంత్రి పదవిలోకి తీసుకోలేదు. దీంతో లోక్ సభ ఎన్నికల తరువాత కేటీఆర్‌ను సీఎం చేయడం ఖాయమన్న వాదన వినిపిస్తూ వచ్చింది. కానీ, తాజాగా కొత్త ప్రచారం ఒకటి మొదలైంది. అదేంటంటే.. కేసీఆర్ ఇప్పట్లో సీఎం సీటు వదిలే ప్రసక్తే లేదంటున్నారు.
అయితే, మరి కేటీఆర్ ను ఎందుకు కేబినెట్లోకి తీసుకోలేదన్న ప్రశ్న వినిపిస్తోంది. దీనికి టీఆరెస్ వర్గాల్లో సమాధానం వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో పట్టు పెంచుకోవాలంటే లోక్ సభ సీట్లు ఎక్కువ సాధించాలని.. అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారట. ఆ క్రమంలోనే హరీశ్ - కేటీఆర్ లను మంత్రివర్గంలోకి తీసుకోకుండా వారిని లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం పనిచేయించడానికి ఉపయోగిస్తున్నారని.. ఎన్నికలు పూర్తయ్యాక వారు మంత్రివర్గంలోకి వస్తారని అంటున్నారు.
అంటే.. కేటీఆర్ ప్రస్తుతానికి సీఎం కానట్లేనని అర్థం. పైగా. కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు తొందరగానే అర్థమయ్యాయట. తాను కలిసిన నవీన్ పట్నాయిక్ ఎటూ తేల్చకపోవడం.. తనకు మద్దతిచ్చిన మమత ఆ తరువాత చంద్రబాబు పక్షం వహించడం.. దేవెగౌడ వంటివారూ చంద్రబాబు మాట విని కాంగ్రెస్ వైపు మొగ్గుతుండడం వంటివన్నీ చూశాక జాతీయ రాజకీయాలు మన ఒంటికి పడవని కేసీఆర్ కు అర్థమైపోయిందట. దీంతో... రాష్ట్రాన్ని వదిలి కేంద్రంలో తాను చక్రం తిప్పడం అంత ఈజీకాదని.. కాబట్టి ఎటూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చేలా ఉంది కాబట్టి కూతరు కవితను మంత్రిని చేస్తే చాలనుకుంటున్నారట ప్రస్తుతానికి. సో.. కేసీఆర్ కేంద్రం ఆశలు లేకపోవడంతో కేటీఆర్ సీఎం ఆశలకు అడ్డుకట్ట పడినట్లయింది.