కాంగ్రెస్ పార్టీతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటుందో లేదో దేవుడికెరుక. ఈలోగా పార్టీలో మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ పొత్తు చిచ్చు రోజరోజకు రగులుతూనే ఉంది. ముందుగా మంత్రులు అయ్యన్న పాత్రుడు - కె.ఈక్రష్ణమూర్తి పొత్తును వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు. వారి ప్రకటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వారిపై క్రమశిక్షణ చర్య తీసుకునే వరకూ వెళ్లింది వ్యవహారం. మరో వైపు తెలంగాణ తెలుగుదేశం నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రులపై ఘాటుగానే స్పందించారు. వారిని అదుపు చేయాలంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో కాంగ్రెస్ పార్టీతో అంత రుచించడం లేదు. ఇన్నాళ్లూ అధినేతకు ఎదురుతిరిగి మాట్లాడని నాయకులు ఇప్పుడు ఆయన్ని ఎదిరించి మాట్లాడడమే కాదు... తిరగబడుతున్నారు కూడా. తెలంగాణలో గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ ను పణంగా పెడుతున్నారంటూ వారంతా ఆంధ్ర తమ్ముళ్లు రగిలిపోతున్నారు.
ఇదిలా ఉండగా పొత్తు గురించి ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదంటూ చంద్రబాబు నాయుడు ఆదేశించినా నాయకులు మాత్రం ఆయన మాటను పెడ చెవిన పెడుతున్నారు. తాజాగా రెండోసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రష్ణమూర్తి మళ్లీ పొత్తుపై స్పందించారు. కాంగ్రెస్ తో కలిస్తే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని ఆయన రెండోసారి వ్యాఖ్యానించారు. ఇది మళ్లీ దుమారం రేపింది. కె.ఈ. క్రష్ణమూర్తి రెండోసారి చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. పొత్తుపై బహిరంగంగా మాట్లాడి పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తారని అన్నారు. ఎవరి అభిప్రాయంలో పార్టీలోనే చెప్పాలని కూడా హితవు పలికారు. వర్ల వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి కె.ఈ. క్రష్ణమూర్తి ఘాటుగానే స్పందించారు. తనకు నీతులు చెప్పడానికి వర్ల రామయ్య ఎవరూ అని ప్రశ్నించారు. అంతే కాదు... కార్యకర్తల మనసులో ఉన్నదే తాను చెప్పానని, ఇది తన సొంత అభిప్రాయం కాదని కూడా అన్నారు. ఇక ధర్మపోరాట సభలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మందలించారంటూ వచ్చిన వార్తలపై కూడా కె.ఈ.క్రష్ణమూర్తి స్పందించారని అన్నారు. ముఖ్యమంత్రి తనను మందలించలేదని, అసలు ఆ ప్రస్తావనే రాలేదని ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఇలా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై రోజురోజుకు తెలుగుదేశం పార్టీలో పెరుగుతోంది. ఇది ఎక్కడికి ఎలా తీసుకువెళ్తుందోనని పార్టీలో చర్చ జరుగుతోంది.