ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేసిన నేరానికి జైలుశిక్ష అనుభవిస్తున్నడేరా బాబా ఉదంతంలో ఇప్పుడో ఆసక్తికర ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే హనీప్రీత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం లభించటం లేదు.
గుర్మీత్‌కు జైలుశిక్ష విధించిన తర్వాత నుంచి హనీ కనిపించకుండా పోయారు. ఆమెపై లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఆమె కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు కూడా. ఇంత జరుగుతున్నా ఆమె జాడ కనిపించకుండా ఉండటం ఇప్పుడు పలు సందేహాలకు తెర లేస్తోంది. ఇదిలా ఉంటే.. గుర్మీత్ పై ఉన్న మూడు కేసుల్లో కీలక సాక్షిగా వ్యవహరిస్తున్న కట్టా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా డేరా బాబాకున్న నెట్ వర్క్ లో ఎక్కడో ఒకచోట హనీప్రీత్ ను దాచి పెట్టి ఉంటారని చెబుతున్నారు. ఆయనకు చెందిన అన్నీ డేరా ఆశ్రమాల్ని సోదాలు జరిపితే హనీ ఆచూకీ లభిస్తుందన్నారు. ఇప్పటికే హనీప్రీత్ కారు డ్రైవర్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే రీతిలో హనీ కూడా ఏదో ఒక డేరా ఆశ్రమంలో ఉండి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుర్మీత్ కు జైలుశిక్ష విధించిన తర్వాత ఆయన్ను తప్పించేందుకు పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాలన్న ప్లాన్‌ను హనీ వేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి.. కట్టా సింగ్ చెప్పినట్లుగా డేరా బాబాకున్న ఆశ్రమాల్ని సోదాలు జరుపుతారా?