కరోనా పుణ్యమా అని.. ఆన్ లైన్ క్లాసులు.. ఆన్ లైన్ కోర్సుల గురించి అవగాహన అందరికి వచ్చేసింది. ఇలాంటివేళ.. నెల సమయంలో ఆన్ లైన్ లో ఎన్ని కోర్సులు పూర్తి చేసే అవకాశం ఉంది? అన్న ప్రశ్నను మీకు వేస్తే.. మీరేం సమాధానం ఇస్తారు? ఆన్ లైన్ కోర్సుల మీద అవగాహన ఉన్న వారైతే.. ఐదారు అని చెప్పేస్తారు. కాదూ కూడదంటే ఒక పది కోర్సులు చేస్తామని చెబుతారు. కానీ.. కేరళకు చెందిన ఫాతిమా అందుకు భిన్నంగా.
ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ కేరళ అమ్మాయి తాజాగా నెలకొల్పిన ప్రపంచరికార్డు గురించి వింటే నోట మాట రాదంతే. ఎందుకంటే.. ఆమె నెలకొల్పిన రికార్డు అల్లాటప్పాది కాదు మరి. కాసర్ గోడ్ జిల్లాకు చెందిన ఆమె.. కేవలం 35 రోజుల్లో ఏకంగా 628 కోర్సుల్నిపూర్తిచేసింది. ఆన్ లైన్ డిప్లమా కోర్సుల్ని పూర్తి చేసిన ఆమె.. ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలోకాలేజీకి వెళ్లే అవకాశం లేకపోవటంతో ఆమె.. అమెరికన్ వర్సిటీలైన మిషిగన్.. యాలే.. జార్జియాలు ఆఫర్ చేసే పలు ఆన్ లైన్ కోర్సుల్ని పూర్తిగా చేశారు. ఆగస్టు 25 నుంచి ప్రతి రోజు కనీసం 20కోర్సుల్ని పూర్తి చేసేవారు. పట్టుదల.. ఓపిక.. శ్రద్ధ ఉండాలే కానీ.. ఇలాంటి రికార్డుల్ని సాధించొచ్చని చెబుతున్నారుకానీ.. ప్రాక్టికల్ గా మాత్రం అది చాలా.. చాలా కష్టమంటున్నారు. ఫాతిమా చేసిన కోర్సుల్లో అత్యధికం.. సైన్స్.. మ్యాథ్స్.. హెల్త్ సబ్జెక్టులు ఉన్నాయని చెబుతున్నారు. ఫాతిమా.. మామూలు అమ్మాయి కాదుగా?