అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి మస్తు కోపం వచ్చింది. ఎమ్మెల్యే అన్నంతనే ప్రభుత్వ స్కూళ్లను సందర్శించటం.. అక్కడ పిల్లలకు పాఠాలు ఎలా చెబుతున్నారు? స్కూల్ ఎలా నడుస్తోంది లాంటివి చూడటం మామూలే. నిజానికి స్కూళ్లలో సదుపాయాలు చూసేందుకు ఎమ్మెల్యేలు పెద్దగా ఆసక్తి చూపరు. ఆ లెక్కన చూస్తే కేతిరెడ్డి మిగిలిన వారి కంటే చాలా బెటర్.
తాజాగా ఆయన ధర్మవరంలోని ప్రైవేటు స్కూల్ ను సందర్శించారు. అకస్మిక తనిఖీల్లో భాగంగా స్కూలుకు వచ్చిన ఆయన.. అక్కడి యాజమాన్యం తీరు చూసి షాక్ తిన్నారు. స్కూల్ గోడలంటే వివేకానందుని సూక్తులో... గాంధీజీ చెప్పిన మంచి మాటలతో నిండి ఉంటాయి. అందుకు భిన్నంగా సదరు రవీంద్రభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందట.
హెడ్మాస్టార్ గదిలో ఫీజులు క్యాష్ లెస్ తో తీసుకుంటామన్న భారీ బోర్డు చూసి అవాక్కు అయ్యారు. ఇదేమైనా స్కూలా? బ్యాంకా? అంటూ ఆయన మండిపడ్డారు. డబ్బే పరమావధిగా పని చేస్తుందనటానికి ఈ బోర్డు ఒక్కటి చాలంటూ ఫైర్ అయ్యారు. పిల్లలకు స్ఫూర్తి కలిగించే అంశాలు లేకుండా కేవలం డబ్బే పరమావధి అన్నట్లుగా ఈ క్యాష్ లెస్ బోర్డులు ఏమిటంటూ మండిపడ్డారు. కార్పొరేటు స్కూళ్లు అన్ని వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి.. డబ్బులు ముందు.. చదువులు తర్వాత అన్నట్లు మారిన వేళ.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలమంటున్నారు.