క్రికెట్ మత్తులో పడి.. ఆణిముత్యాల్లాంటి మిగిలిన క్రీడల్ని.. క్రీడాకారుల్ని అస్సలు పట్టించుకోవటం లేదు. సంచలన విజయాలు సాధిస్తున్నా.. పెద్దగా ప్రచారం రాకుండా ఉండిపోతున్న వారు ఎందరో. దాయాది పాక్ చేతిలో చావుదెబ్బ తిన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగిన రోజునే ఇండోనేసియా ఓపెన్ సూపర్ సీరిస్ ను సొంతం చేసుకొన్న తెలుగు తేజం.. గుంటూరు కుర్రాడు కిడాంబి శ్రీకాంత్.. మరోసారి తన సత్తా చాటాడు.
పాక్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్ ఓటమి.. కోహ్లీ ఇగో కారణంగా కుంబ్లే లాంటి చక్కటి కోచ్ టీమిండియాకు దూరం కావటంపై సాగుతున్న రచ్చకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న మీడియా పుణ్యమా అని.. సంచలన విజయాలు సాధిస్తున్న వారి ముచ్చట అస్సలు హైలెట్ కావటం లేదు.
ఆదివారం ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించేసి.. ఆ వెంటనే ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సీరిస్ కు వెళ్లిన శ్రీకాంత్.. తాజాగా పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడ్ని ఓడించి సంచలనం సృష్టించాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలిగేమ్ ను కోల్పోయి వెనుకబడిన శ్రీకాంత్.. ఆ తర్వాత పుంజుకొని వరుస రెండు గేములతో వరల్డ్ నెంబర్ వన్ ను ఓడించి.. టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేశాడు. 15-21, 21-13, 21-13 తేడాతో దక్షిణకొరియా ఆటగాడు సన్ వాన్ హో మీద సంచలన విజయాన్ని సాధించి.. క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. ఇదే సిరీస్ లో మరో భారత ఆటగాడు సాయి ప్రణీత్ సైతం ముందంజలో ఉన్నాడు. ప్రిక్వార్టర్స్ లో హువాంగ్ యుజియాంగ్ అనే చైనా ఆటగాడిని ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. అస్తమానం క్రికెట్..క్రికెట్ అని జపిస్తూ కోహ్లీ లాంటి వాళ్లకు కొమ్ములు తెచ్చే కన్నా.. ఇలాంటి యువ కిశోరాలకు దన్నుగా నిలిస్తే.. మరెన్ని సంచలనాలు సృష్టిస్తారో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/