బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్ పై కేసు నమోదైంది. ఈయన డైరెక్టర్ గా ఉన్న న్యాయకళాశాలలో లా చదువుతున్న విద్యార్థిని కనిపించకుండా పోవడం.. అంతకుముందే చిన్మయానంద్ తనను లైంగిక వేధింపులు చేస్తున్నాడని విద్యార్థిని ప్రధాని మోడీ, యూపీ సీఎం కు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆ తర్వాత అదృశ్యమవడం కలకలం రేపుతోంది. చిన్మయానంద్ తమ కూతురును కిడ్నాప్ చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లోని స్వామి సుఖదేవానంద లా కాలేజీలో విద్యార్థిని చివరి సంవత్సరం చదువుతోంది. ఈమె ఇదే కాలేజీ హాస్టల్ లో ఉంటోంది. ఈ కళాశాల డైరెక్టర్ గా ఎంపీ చిన్మయానంద్ ఉంటున్నారు. ఈయన తనపై తరుచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని.. తనను రక్షించాలని విద్యార్థిని ప్రధాని మోడీ- యూపీ సీఎం యోగికి వీడియో తీసి 23న ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఎంపీ చిన్మయానందే కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా ఎంపీ చిన్మయానంద్ కు చెందిన కాలేజీ యాజమాన్యం దీనిపై స్పందించింది. అశ్లీల వీడియోలను అడ్డుగా పెట్టుకొని విద్యార్థిని, వారి తల్లిదండ్రులు తమను బ్లాక్ మెయిల్ చేశారని .. 5 కోట్లు అడిగారని విద్యార్థిని తల్లిదండ్రులపై తిరిగి కేసు పెట్టడం గమనార్హం.