డిజిటల్ యుగంలోకి ప్రపంచం పరుగులు పెడుతున్నట్లు చెప్పినా.. ఈ భూమి మీద చాలానే చోట్ల ఇప్పటికి రాజరికం.. నియంతృత్వం నడుస్తూనే ఉంది. శతాబ్దాల క్రితం ఎలాంటి కష్టనష్టాల్ని ఎదుర్కొంటున్నారో.. ఆధునిక ప్రపంచంలోనూ కొన్ని దేశాల ప్రజలు ఇలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొంటున్నారు. జట్టుకు పన్ను గురించి చరిత్ర పుస్తకాల్లో మనం ఇప్పుడు చదువుకుంటున్న.. కొన్ని దేశాల్లో ఇలాంటివి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. అలాంటి దేశాల్లో ఒకటి ఉత్తర కొరియా.
ఈ దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కిమ్ జాంగ్ ఉన్ ఎలాంటోడో ప్రపంచం మొత్తానికి తెలిసిందే. నిలువెత్తు రాక్షసుడైన ఈ నియంతకు ఒక ముద్దుల చెల్లెలు ఉంది. ఆమె పేరు కిమ్ యో జాంగ్. 29 ఏళ్ల తన చెల్లికి పెళ్లి చేయాలని నియంత అన్నకు ఆలోచన వచ్చింది. మరి.. తన చెల్లెలకు తగిన వరుడి కోసం ఈ నియంత అన్న ఏం చేస్తున్నాడు? ఎలాంటి పెళ్లికొడుకు కావాలనుకుంటున్నాడు? అన్న అంశాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు బయటకు పొక్కి ఆసక్తికరంగా మారింది.
నియంత అన్నగారి కండీషన్లలో అతి ముఖ్యమైనది.. తన చెల్లెలకు కాబోయే వరుడి హైట్ 5 అడుగుల 10 అంగుళాలు ఎంతమాత్రం తగ్గకూడదట. సదరు కుర్రాడు ఉత్తర కొరియా వాసి పక్కాగా అయి ఉండాలి. ఇక.. రాజధాని నగరంలోని ప్యోంగ్యాంగ్ లోని కిమ్2 సుంగ్ వర్సటీలో చదువుకొని ఉండటం తప్పనిసరి. ఒకవేళ అక్కడ చదవకున్నా.. ఆ వర్సిటీ డిగ్రీ అయితే పక్కాగా ఉండాల్సిందేనట. ఈ గుణాలన్నింటితో పాటు సైన్యం పని చేసిన అర్హత కూడా ఉండాల్సిందేనని చెబుతున్నాడు.
ఈ అర్హతలు ఉన్న 30 మందిని నియంత అన్న తానే స్వయంగా ఎంపిక చేస్తాడట. అలా చేసిన తర్వాత స్వయంవరం నిర్వహిస్తాడట. అందులో ఒకడిని ఎంపిక చేసుకోవటానికి గారాల చెల్లెలకు అవకాశం ఇస్తాడట. అది కూడా ఎందుకు.. అన్నగారికి నచ్చినోడ్ని పెళ్లి చేసేసుకోమంటే సరిపోయేది కదా..? అయితే.. ఈ నియంత అన్నలోని కొత్త కోణాన్ని కొందరు ప్రస్తావిస్తూ.. ఇన్ని రూల్స్ పెట్టినా తనలోని ప్రజాస్వామ్య అన్న కోణాన్ని కిమ్ జాంగ్ బయటపెట్టినట్లుగా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.