కొంతమంది నేతలకు ఏమవుతుందో అస్సలు అర్థం కాదు. కొన్ని సమయాల్లో చెలరేగిపోయినట్లుగా మాట్లాడే నేతలు.. మరికొంత కాలం అస్సలేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ నేతగా పాపులర్ అయిన బీజేపీ కిషన్ రెడ్డి.. టీఆర్ ఎస్ అధినేత మీదా.. ఆ పార్టీ మీదా విమర్శలు చేసేందుకు ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తుంటారు. తొందరపడి వ్యాఖ్యలు చేయటానికి అస్సలు ఇష్టపడరు.
ఇటీవల ఆయన బీజేపీని వదిలేసి.. టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మొయిన్ స్ట్రీం మీడియా కంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్తతో కిషన్ రెడ్డి పడుతున్న అవస్థ అంతా ఇంతా కాదు. తాజాగా. తన నిబద్ధతను ప్రదర్శించుకోవటానికి అన్నట్లుగా ఆయన నోరు విప్పినట్లుగా కనిపిస్తోంది.
గడిచిన కొంతకాలంగా కేసీఆర్ తీరుపై అప్పుడప్పుడు మాత్రమే.. అది కూడా ఆచితూచి అన్నట్లు రియాక్ట్ అయ్యే కిషన్ రెడ్డి.. ఈసారి మాత్రం కాస్త ఘాటుగా రియాక్ట్ కావటం విశేషం. లేని సమస్యల్ని సృష్టించి పార్లమెంటును టీఆర్ ఎస్ పార్టీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.
చట్టంలోని రిజర్వేషన్ అంశంలో ఒక్క అక్షరాన్నీ మోడీ సర్కారు మార్చలేదని.. ఆ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. మజ్లిస్ ఎంపీతో కలిసి పార్లమెంటులో గులాబీ ఎంపీలు ధర్నా చేయటం చూస్తే.. రిజర్వేషన్ల అంశం వెనుక ఎవరు ఉన్నారన్నది ఇట్టే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీలకు దురద పుడితే ఒకరినొకరు గోక్కోవాలే కానీ.. ప్రజలను గోక్కోవాలనటం సరికాదన్నారు.
లక్షమంది కేసీఆర్ లు వచ్చినా తాను టీఆర్ ఎస్ పార్టీలోకి మారేది లేదంటూ విషయాన్ని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి.. దేశంలో కేసీఆర్ కు మించిన పెత్తందారు మరెవరూ ఉండరన్నారు. బీజేపీకి గుణపాఠం చెబుతామని టీఆర్ ఎస్ నేతలు చెప్పటం కామెడీ అని.. నాలుగేళ్లు అవుతున్నా ఎలాంటి హామీల్ని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. ఇందుకు కేసీఆర్ కే ప్రజలు చక్కటి గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.