కేసీఆర్ ను గాడిద అన్న కిషన్ రెడ్డి

Update: 2015-11-19 07:22 GMT
వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం చివరిరోజున పూర్తిగా వేడెక్కింది. టీడీపీ - బీజేపీల ఉమ్మడి అభ్యర్థి దేవయ్యకు మద్దతుగా ప్రచారం చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ ను ఉద్దేశించి గతంలో ఉపయోగించిన సామెతనే కిషన్ ఇప్పుడు కేసీఆర్ పై ప్రయోగించారు.

తెలంగాణ ముఖ్యమంత్రిపై కిషన్ నిప్పులు కక్కారు. ''గాడిదెకు గడ్డేసి - నరేంద్ర మోదీని అడిగితే ఏం లాభం?'' అని ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు.  ఎన్‌ డీఏ అభ్యర్థి దేవయ్యను గెలిపిస్తే, టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంపై అంకుశంలా పని చేస్తామన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాటం జరగలేదని, జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నాయకత్వంలో అనేక రాజకీయ పార్టీలు, అన్ని రంగాలు వ్యక్తులు కలిసి ఉద్యమం చేశాయన్నారు. ఇపుడు ఉద్యమ సమయంలో కేసీఆర్‌ కాంగ్రెస్‌ ను ఉద్దేశించి, గాడిదెకు గడ్డేస్తే - ఆవు పాలిస్తుందా..? అని ప్రశ్నించారని, ఇపుడు టీఆర్‌ ఎస్‌ అధికార పీఠం ఎక్కి బీజేపీని నిందించడం విడ్డూరంగా కనిపిస్తుందన్నారు. కేసీఆర్ సామెత ఆయనకే వర్తిస్తుందని... గాడిదకు గడ్డేసి మోదీని పాలడిగితే ఎలా అని అన్నారు. తెలంగాణ బాగు పడాలంటే ఎన్‌ డీఏ అభ్యర్థి దేవయ్యను గెలిపించాలని కోరారు.

అయితే.. కిషన్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ ను గాడిదతో పోల్చారని టీఆరెస్ శ్రేణులు మండిపడుతుండగా ఆయనకు ఓటేసి గెలిపించారన్న ఉద్దేశంలో వాడిన గడ్డి అనే పదం ఓటుకు సింబాలిక్ గా ఆయన వాడారని... ఆ పద ప్రయోగం ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని పలువురు అంటున్నారు.
Tags:    

Similar News