టోటల్ టీడీపీని యాక్టివ్ చేస్తున్న కొడాలి

Update: 2022-09-11 12:51 GMT
ఆయన ఇంటిపేరు కొడాలి. మాటలు కొడవలి పదునుతో ఉంటాయి. మీడియా ముందుకొచ్చి మాట్లాడారు అంటే అదురు బెదురు ఉండదు. తాను మనసులో ఏమనుకుంటున్నానో అదే అనేస్తారు. మంత్రిగా ఉన్నప్పుడు బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న  కొడాలి నాని మినిస్టర్ కుర్చీ దిగిపోయిన అయిదు నెలల తరువాత  మళ్లీ తన ఘాటైన మిర్చీ  మాటతో మంటెక్కించారు. ఆయన ఏకంగా చంద్రబాబు లోకేష్ ల మీద గతం కంటే ఎక్కువ తీవ్రతతో కామెంట్స్ చేశారు.

ఈసారి అయితే టీడీపీ క్యాడర్ ఏ కోశానా తట్టుకోలేనివే కొడాలి మాటలుగా ఉన్నాయి. దాంతో క్రిష్ణా జిల్లా టీడీపీ ఒక్కసారిగా రియాక్ట్ అయింది. దేవినేని నాని, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్యలు అయితే కొడాలి మీద ఒక్కసారిగా మండిపోయారు. చలో గుడివాడ అంటూ బయల్దేరారు. వారిని పోలీసులు అడ్డుకుని గూడూరు పీఎస్ కి  తరలించారు. క్యాడర్ తో తరలి వచ్చారు. ఇంకో వైపు చూస్తే  పెడన టీడీపీ ఇన్చార్జి కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, బోడె ప్రసాద్ ఏకంగా గుడివాడకే నేరుగ  చేరుకున్నారు. అక్కడ వారికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్లు కూడా తోడు కావడంతో అంతా కలసి కొడాలి మీద గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ప్రయత్నించారు.

ఇక క్యాడర్ కూడా భారీ ఎత్తున రావడంతో గుడివాడ పసుపుదనంతో నిండిపోయింది. పోలీసులు అయితే వారిని అడ్డుకున్నారు. కొందరు నాయకులను మాత్రమే అనుమతించడంతో వారు కొడాలి మీద ఆన సొంత ఊళ్ళో ఫిర్యాదు చేశారు. ఇక బుద్ధా వెంకన్న అయితే కొడాలి నీవైనా మమ్మల్ని చంపు లేకపోతే మేమే నిన్ని చంపెస్తామని రెచ్చిపోయారు. ఈ విధంగా బుద్ధా వెంకన్న బిగ్ సౌండ్ చేసినా దేవినేని ఉమ వీధుల్లోకి వచ్చినా దానికి కారణం కొడాలి మాటల హీటే మరి.

కొడాలి డైరెక్ట్ అటాక్ తో క్రిష్ణా జిల్లా రాజకీయం రచ్చగా మారుతోంది. అయితే అది అధికార వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ టీడీపీ ఫుల్ యాక్టివ్ అయింది. గతంలో వారూ వీరుగా ఉన్న వారు సైతం ఇపుడు ఒక్కటిగా కొడాలి మీదకు దండెత్తుతున్నారు. గుడివాడలో అయితే కొడాలి కంటే ముందు ఒకసారి ఎమ్మెల్యే అయిన రావి వెంకటేశ్వర్లు ఇపుడు గేరు మార్చి జోరు చేస్తున్నారు.

కొడాలి సడెన్ గా ఎందుకు ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే మళ్ళీ ఆయనలో మంత్రి ఆశలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ వస్తోంది. అయితే కొడాలిని తప్పించింది కూడా ఆయన నోటి దూకుడు తట్టుకోవడం కష్టమనే అన్న భావన ఉంది. అలాంటి టైం లో ఇపుడు ఆయన్ని కనుక మంత్రిని చేస్తే ఎన్నికల వేళకు ఒక్క క్రిష్ణ జిల్లా ఏమి ఖర్మ ఏపీ అంతటా టీడీపీని రీచార్జ్ చేస్తారు అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. ఏది ఏమైనా టీడీపీ మీద విమర్శలు చేయండి అన్న జగన్ సూచనలు ఆదేశాలు కొడాలి నానికి ఇలా అర్ధమయ్యాయా అంటే జవాబు క్రిష్ణా జిల్లా వైసీపీ వారైనా ప్రత్యేకించి గుడివాడ ఫ్యాన్ పార్టీ వారు అయినా చెప్పాలేమో.
Tags:    

Similar News