రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయాల్సిందేనని ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జేఏసీ నిర్ణయింది. నిరుద్యోగుల నిరసన ర్యాలీని ప్రభుత్వం అడ్డుకున్నందున, ఈ దఫా నగరంలోనే నిరుద్యోగుల బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాటుగా సమస్యలపై ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేయాలని తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. తెలంగాణ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ కీలక భేటీ జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు - ప్రభుత్వ విధానాలు - మొండి వైఖరి - ఇందిరా పార్కు తరలింపు - మధుకర్ మృతి తదితర అంశాలపై చర్చించారు.
ఫిబ్రవరి 22న టీజేఏసీ నిర్వహించాలనుకున్న నిరుద్యోగుల నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేసినందున తిరిగి హైదరాబాద్ లోనే నిరుద్యోగుల అధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించాలని, అందుకు టీజేఏసీ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తొలుత నిజాం కళాశాల మైదానాన్ని కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేయాలని భావించారు. నిరసన ర్యాలీ అంటే అంగీకరించలేదు కాబట్టి నేరుగా బహిరంగ సభకు అనుమతించాలని కోరనున్నారు. అనేక పార్టీలకు - వివిధ ప్రజా సంఘాలకు బహిరంగ సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లే తమకూ ఇవ్వాలని కోరాలని నిర్ణయించారు. అయినా అనుమతించకపోతే కోర్టును ఆశ్రయించాలని భావించారు.
ఈ సమావేశాం నంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ మిర్చి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, మిర్చి క్వింటాల్ కు 12వేల రూపాయలు వచ్చేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. కందులనూ కేంద్రమే కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 12న శ్రీరాంపూర్ - మంచిర్యాలలో వారసత్వ ఉద్యోగాలపై సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ పై హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ ను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మంధని మధుకర్ మృతి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మధుకర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/