స్పీక‌ర్ హెడ్‌ ఫోన్లను స‌హాయ‌కుడు తీయాలా?

Update: 2016-03-14 07:53 GMT
చిన్న చిన్న విష‌యాలే కానీ.. చూసేందుకు ఇబ్బందిక‌రంగా ఉంటాయి. నిజానికి ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్ట‌క‌పోవ‌ట‌మో.. ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌ట‌మో కార‌ణంగా కొన్ని జ‌రిగిపోతుంటాయి. తాజాగా ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్ని చూస్తే.. స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ హెడ్ ఫోన్స్ ను స‌హాయ‌కుడు తీయ‌టం క‌నిపిస్తుంది.

స‌హాయ‌కుడి చేత ప‌ని చేయించుకోవ‌టం త‌ప్పేం కాదు. కానీ.. హెడ్ ఫోన్స్ తీసేందుకు కూడా స‌హాయ‌కుడి అవ‌స‌రం అంత స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. హెడ్‌ ఫోన్స్ పెట్టుకోవ‌టానికి.. తీసుకోవ‌టానికి స్పీక‌ర్ త‌న‌కుతానుగా చేసుకుంటే మ‌రింత బాగుంటుంద‌న్న సూచ‌న‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి అంశాల్ని చాలామంది ప‌ట్టించుకోన‌ట్లుగా క‌నిపిస్తారు. కానీ.. ఇలాంటి సున్నితమైన అంశాల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండ‌టం ద్వారా విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా ఉండే అవ‌కాశం ఉంది.

ఎవ‌రికి వారు చేసుకునే ప‌నుల విష‌యంలో వీలైనంత‌వ‌ర‌కు చేసుకోవ‌టం బాగుంటుంది. హెడ్ ఫోన్స్ తీయ‌టం పెద్ద క‌ష్ట‌మైన ప‌ని కాదు. అదే విధంగా పెట్టుకోవ‌టం కూడా. అలాంట‌ప్పుడు హెడ్‌ ఫోన్స్ ను స‌హాయ‌కుడు తీయాల్సి రావ‌టం ఏమిటో..? మ‌రి.. ఈ విష‌యం మీద ఏపీ స్పీక‌ర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News