తనపై వచ్చే విమర్శలకు కేవలం తన ప్రదర్శనతోనే సమాధానం చెబుతుంటాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఓ రెండు మ్యాచ్‌లో కోహ్లీ నీరసించగానే అతడిపై విమర్శలు వస్తుంటాయి. వాళ్లందరికీ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పడం కోహ్లీ స్టయిల్. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఇటీవల ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. గతంలో కేవలం క్రికెట్ దిగ్గజం .. సచిన్ మీద మాత్రమే ఉన్న రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నారు. స్వదేశంలో 10 వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన ఘనత కేవలం సచిన్ మీదే నమోదై ఉంది. ప్రస్తుతం ఆ రికార్డును కోహ్లీ సైతం సాధించాడు.
ఇంగ్లాండ్ సీరిస్‌లో భాగంగా పుణెలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనతను సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డును సచిన్ నమోదు చేయగా.. తాజాగా కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో కోహ్లి 56 పరుగులు సాధించాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాక కోహ్లీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. కోహ్లికి ఇది 61 వ హాఫ్ సెంచరీ కావడం మరో విశేషం.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ధవన్‌తో కలిసి కోహ్లీ రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ధవన్ 98 పరుగులు సాధించి రెండు పరుగుల దూరంలో సెంచరీ కోల్పోయాడు. ఇక కేఎల్ రాహుల్ 62 పరుగులు సాధించి అజేయంగా నిలవగా, కృనాల్ పాండ్యా 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో ముందుగా ఇంగ్లాండ్ ఆరంభం అదిరినా ఆ తర్వాత ఒత్తిడికి లోనై వరుసగా వికెట్స్ కోల్పోయి ఓటమి పాలయ్యారు.