ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరం..అత్యంత చౌకైన నగరాన్ని ఎంపిక చేసే అధ్యయనం ఒకటి ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. తాజాగా అలాంటి అధ్యయనం ఒకటి వెల్లడైంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిస్తే.. అత్యంత చౌకైన నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నిలవటం గమనార్హం. గ్లోబల్ హెచ్ ఆర్ కన్సల్టెన్సీ నిర్వహించే వార్షిక సర్వే నివేదిక ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. చౌకైననగరంగా కోల్ కతా నిలిచినా.. విదేశీయులకు మాత్రం బెంగళూరు మహానగరం విపరీతంగా ఆకర్షిస్తున్నట్లుగా వెల్లడించారు.
కోల్ కతా చౌక నగరమే కాదు.. వలసదారులకు స్వర్గధామంగా ఈ సర్వే పేర్కొనటం గమనార్హం. దేశంలో ఖరీదైన నగరంగా ముంబయి.. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ.. చెన్నై నగరాలు ఉన్నాయి. ఇక.. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ఖరీదైన నగరాల్లో హాంకాంగ్ తర్వాత అంగోలా రాజధాని లౌండా.. జ్యూరిచ్.. సింగపూర్ లు నిలిచాయి. గత ఏడాది ఆరో స్థానంలో ఉన్న జపాన్ రాజధాని టోక్యో ఈసారి ఐదో స్థానానికి చేరుకుంది. ఇక.. కాంగో రాజధాని కిన్షానా టాప్ టెన్ జాబితాలో తొలిసారి నిలవటం విశేషం.
ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఖరీదైన నగరాల జాబితాలో మన దేశంలో ఖరీదైన నగరంగా చెప్పే ముంబయి.. వరల్డ్ వైడ్ గా చూసినప్పుడు 82 స్థానంలో నిలిచింది. ఢిల్లీ 130వ స్థానంలో.. చెన్నై 158.. బెంగళూరు 180వ స్థానాల్లో నిలిచాయి. ఇక.. కోల్ కతా 194వ స్థానంలో నిలిచి చౌక నగరంగా నిలిచింది. ముంబయ జీవనవ్యయానికే అమ్మో అనుకునే వాళ్లం.. ఇక.. లిస్ట్ లో చెప్పిన టాప్ టెన్ సిటీలో జీవన వ్యయం ఏ రేంజ్ లో ఉంటుందో బాగా అర్థమవుతుందని చెప్పాలి.