కోమ‌టిరెడ్డి డైలాగ్ అదిరిపోయిందిగా

Update: 2016-06-10 09:01 GMT
గులాబీ కండువా క‌ప్పుకోవ‌డం ఆల‌స్య అన్న‌ట్లుగా వేగంగా ప‌రిణామాలు చ‌క్క‌బెట్టిన‌ సీఎల్పీ ఉపనేత - ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఇపుడ్ టోన్ మార్చారు. కాంగ్రెస్‌ ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతేనా త‌న జిల్లాకే చెందిన ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పార్టీ మారుతావా అంటూ ప్ర‌శ్నించారు. ఇంకొన్ని నీతి మాట‌లు కూడా చెప్పారు.

నల్లగొండలోని తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన కోమ‌టిరెడ్డి రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ ఆగడాలు మితిమీరిపోయాయని - టీఆర్‌ ఎస్‌ లోకి రావాలని తమ పార్టీ నాయకులను బెదిరిస్తున్నారన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని - సమస్యలు వస్తే తమవద్దకు రావాలని సూచించారు. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాల పేరిట ప్రభుత్వం రూ.3కోట్లు వృథా చేసిందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రైతులకు విత్తనాలు - ఎరువులు పంపిణీ చేయాలనే ధ్యాస ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు.

గాంధీభవన్‌ మెట్లెక్కని గుత్తా సుఖేందర్‌ రెడ్డిని సోనియాగాంధీ చలువతో జిల్లా ప్రజలు రెండుసార్లు ఎంపీగా గెలిపించారని కోమ‌టిరెడ్డి అన్నారు. పార్టీలు మారేవారు రాజకీయ వ్యభిచారులని చెప్పిన సుఖేందర్‌ రెడ్డి ఇప్పుడు పార్టీ ఎలా మారుతున్నారని ప్రశ్నించారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని రెండు లక్షలకుపైగా మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామన్నారు.
Tags:    

Similar News