కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. సరిగ్గా మునుగోడు ఎన్నికల ప్రచారం మగిసే సమయానికి ఆయన నగరానికి
చేరుకున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ కూడా ఉప ఎన్నికకు పూర్తిగా దూరంగా ఉంటూ ఆస్ట్రేలియా వెళ్లిన వెంకటరెడ్డి.. తన తమ్ముడు, మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసమే ఇలా చేశారనే అపవాదును మూటగట్టుకున్నారు.
ఇక పోలింగ్ కొన్ని గంటల్లో ఉందనగా హైదరాబాద్ కు వచ్చేసిన వెంకటరెడ్డి ఇప్పుడే చేస్తారనేది చర్చనీయాంశం కానుంది. అన్నిటికి మించి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుండగా.. అందులోనూ తన నియోజకవర్గానికి సమీప ప్రాంతమైన నగరంలో కొనసాగుతుండగా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
హాజరు కాకుంటే జంపే...?
కాంగ్రెస్ కు సంబంధించి ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్రే ప్రధాన అంశం. అంతకుమించి ఆ పార్టీకి కార్యక్రమాలేమీ లేవు. అలాంటిదానికీ వెంకటరెడ్డి దూరంగా ఉన్నారంటే.. అది జంపింగ్కు ఒక కాలు అటుఇటుగా పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలిస్తే బీజేపీలోకి వెంకటరెడ్డి వెళ్లిపోవడం ఖాయమని భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఓడితే అప్పుడు పరిస్థితులు వేరేగా ఉంటాయి.
ఇక రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ బుధవారం హైదరాబాద్ లో ఉత్సాహంగా కొనసాగింది. గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి ప్రారంభమైన యాత్ర న్యూబోయిన్‌పల్లి, బాలానగర్ మెయిన్‌రోడ్డు, సుమిత్రా నగర్ ఐడీపీఎల్ ఉద్యోగుల కాలనీ మీదుగా మదీనాగూడ చేరుకుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర మియాపూర్‌లోని ఇందిరానగర్ కాలనీ, రామచంద్రాపురం, పటాన్‌చెరు శాంతినగర్ మీదుగా ముత్తంగి వరకు వెళ్లింది.
యాత్ర పొడవునా కాంగ్రెస్ ముఖ్యనేతలు సహా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్‌తో కలిసి నడిచారు. పాదయాత్ర మార్గంమధ్యలో పలుచోట్ల ప్రజల కష్టాలను రాహుల్ తెలుసుకున్నారు. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లకు ఇరువైపులా వేచిచూశారు. పాదయాత్రలో బాలీవుడ్‌కి చెందిన సినీనటి పూజా భట్ రాహుల్‌ను కలిశారు. అయితే, ఇంతమంది వచ్చినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉండడం గమనార్హం.
మునుగోడు ఫలితం చూసి...
మునుగోడులో గురువారం పోలింగ్ జరుగనుంది. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చావోరేవోలాంటి పరిస్థితి. ఇటు వెంకటరెడ్డికి సంకట స్థితి. ఓ విధంగా ఆయన తమ్ముడికి ఫేవర్ చేసేందుకే సరిగ్గా పోలింగ్ ముందురోజు రాష్ట్రంలో దిగేలా షెడ్యూల్ చేసుకున్నారని అంటున్నారు. ఇది లోతుగా చూస్తే నిజమనిపిస్తోంది. వాస్తవానికి కోమటిరెడ్డి బద్రర్స్ ఎన్నికల ప్రణాళిక పకడ్బందీగా ఉంటుంది.
వారేం చేసినా కలిసే చేస్తారు. ఈ విషయాన్ని వెంకటరెడ్డే చెప్పారు. ఇప్పుడు రేపు పోలింగ్ అనగా రాష్ట్రంలో దిగిన వెంకటరెడ్డి.. తన అనుభవాన్నంతా రంగరించి తమ్ముడి పక్షం వహించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. దీనిపై తాను ఎవరి పక్షమో కార్యకర్తలకు స్పష్టంగా చెప్పేందుకే రాహుల్ పాదయాత్రకు దూరంగా ఉన్నట్లు సమాచారం.
మునుగోడు అయ్యాక పాల్గొంటారా?
మునుగోడు పోలింగ్ గురువారం జరగనుంది. అది అయ్యాక వెంకటరెడ్డి.. రాహుల్ పాదయాత్రలో పాల్గొనవచ్చు. అప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. లేదంటే మునుగోడు ఫలితం ఆదివారం వస్తుంది. ఆ తర్వాతైనా పాల్గొనే అవకాశం ఉంటుంది. దీన్ని పార్టీ అగ్ర నాయకత్వం ఎలా స్వీకరిస్తుందో చూడాలి. అన్నట్లు.. వెంకటరెడ్డికి పార్టీ షోకాజ్ ఇచ్చింది. తన తమ్ముడిని గెలిపించమని ఆయన కోరినట్లు సమాచారం అందడంతో షోకాజ్ ఇచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.