పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్న వారిని, ఆడుతున్నవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర హెచ్చరించారు. జిల్లాలోని గుడివాడలో పేకాట క్లబ్బు నిర్వహిస్తున్న, ఆడుతున్న వారిపై హఠాత్తుగా దాడిచేసి అరెస్టు చేయటం సంచలనంగా మారింది. గుడివాడ నియోజకవర్గం మంత్రి కొడాలి నానిది అవటంతో వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.
స్పెషల్ ఎన్ఫోర్స్ మెంటు బ్యూరో తో పాటు స్ధానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 33 మందిని అరెస్టు చేసిన పోలీసులు 28 కార్లు, 13 బైకులను కూడా స్వాదీనం చేసుకున్నారు. అలాగే రూ. 55.39 లక్షల డబ్బును కూడా సీజ్ చేశారు. పొట్లూరి మురళి అనే వ్యక్తి ఆధ్వర్యంలో పేకాట క్లబ్బు నడుస్తోందని పోలీసులు గుర్తించారు. మూడు గంటల పాటు జరిగిన దాడిని తమ సిబ్బంది వీడియో తీసినట్లు కూడా ఎస్పీ తెలిపారు.
గడచిన వారంరోజులుగా తాము 100 క్లబ్బులపై దాడులు జరిపితే గుడివాడలో జరిగిని దాడి మాత్రమే హైలైట్ అయ్యిందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించినా, పేకాట క్లబ్బులు నిర్వహించినా చర్చలు తప్పవని కూడా ఎస్పీ హెచ్చరించటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.