వాళ్ల కన్నా మాది గ్రేట్ అంటున్న కేటీఆర్

Update: 2020-02-06 08:45 GMT
ప్రతీ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.. కేరళ అంటే సీఫుడ్స్ కు ఫేమస్.., ఏపీ అంటే ఉలవచారు ఆవకాయకు... అలాగే హైదరాబాద్ అంటే బిర్యానీకి ఫేమస్. దేశంలో బిర్యానీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే అది హైదరాబాదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ దొరికినంత టేస్టీ బిర్యానీ మరెక్కడా దొరకదంటారు. బిర్యానీకి పుట్టినిల్లుగా హైదరాబాద్ ను మార్చేసారు.

అయితే అలాంటి హైదరాబాద్ బిర్యానీని కాదని.. నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తాజాగా పారిస్ కు చెందిన ‘తలసేరి ఫిష్ బిర్యానీ’అద్భుతమని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్.. ‘ప్రపంచంలోనే ఉత్తమ బిర్యానీగా చెప్పుకునే హక్కులన్నీ హైదరాబాద్ వే.. మిగిలిన బిర్యానీలన్నీ అనుకరణాలే.. ఇటీవల యునెస్కో కూడా మా రుచికరమైన ఆహార సంస్కృతిని గుర్తించి ఓ బిరుదును కూడా ఇచ్చింది’ అంటూ నీతి అయోగ్ సీఈవోకు కౌంటర్ ట్వీట్ చేశారు.

ఇలా ప్రపంచంలోనే హైదరాబాద్ బిర్యానీ అద్భుతమని కేటీఆర్ గొప్పలు చెప్పారు. పారిస్ వాళ్ల కన్నా మాదే గ్రేట్ అంటూ స్పష్టం చేశారు.


Tags:    

Similar News