తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్ గా మారిపోయింది. మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత.. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరం..అనంతరం జానా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంలో.. మాట తూలి కూడా సమర్థంగా సమర్థించుకునే తత్త్వం ఉన్న తెలంగాణ అధికారపక్షం తన మొగ్గును ప్రదర్శించుకోగా.. ఆ స్థాయిలో మాట్లాడలేని జనారెడ్డి వేలెత్తి చూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
నిజానికి తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు పట్టుకున్న జానారెడ్డి.. ‘‘మంత్రి మాట్లాడే సందర్భంలో నా తెలంగాణ అంటున్నారు. నా తెలంగాణ కాదు. మన తెలంగాణ అనాలి’’అంటూ హితబోధ చేసే ప్రయత్నం చేశారు. జానారెడ్డి మాటలకు సమాధానం చెప్పేందుకు మంత్రి కేటీఆర్ కల్పించుకొని కాంగ్రెస్ పార్టీని కడిగిపారేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నా తెలంగాణ అనుకునేలా చేయలేదంటూ చరిత్రలోకి వెళ్లిన కేటీఆర్.. 1956లో బలవంతపు పెళ్లి చేశారని.. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించినప్పుడు వందలాది మందిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపిన ఘన చరిత్ర కాంగ్రెస్ దంటూ దుయ్యబట్టారు. తెలంగాణ ఏమీ కాంగ్రెస్ పుణ్యానికి ఇవ్వలేదని.. పోరాడితేనే వచ్చిందన్నారు.
తెలంగాణ ఇస్తామని 2004లో చెప్పి 2014 వరకూ సాగదీసి పలువురి ప్రాణాలు పోయేలా చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రోజుజాతీయ పార్టీగా చెబుతున్నా.. పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిందని.. జనాలు ఛీ కొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాటలతో ఆగ్రహం చెందిన జానారెడ్డి.. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావటానికి తామెంతగా కష్టపడింది చెప్పుకొచ్చారు.
ఆంధ్రా ప్రాంత ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తే.. ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు తన ఇంటికి హుటాహుటిన వచ్చారని.. తాను అప్పుడు పడుకొన్నానని.. లేచి మరీ కేసీఆర్ తో తెలంగాణ సాధిద్దామని చెప్పానని.. సోనియాగాంధీకి నచ్చజెప్పి తెలంగాణ ఇప్పించినట్లుగా చెప్పారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన జానారెడ్డి.. టీఆర్ఎస్ పోరాటాల వల్ల తెలంగాణ రాలేదన్న మాటను చెప్పే ప్రయత్నంలో ఒక మాటను అనేశారు. నాడు కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోనే ఉందని.. నిజంగా తెలంగాణ ఇవ్వకూడదని అనుకుంటే అణిచేసేవారిమని.. కానీ తాముఅలా చేయలేదన్నారు.
జానారెడ్డి అన్న మాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్.. జానారెడ్డి అంటే తమకెంతో గౌరవం ఉందని.. కానీ.. అంత పెద్దమనిషి ఇలాంటి మాటలు అనటం ఏమిటని.. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేస్తామని చెప్పటం ద్వారా.. ఉద్యమాన్ని అవమానించేలా మాట్లాడారంటూ రివర్స్ ఫైర్ అయ్యారు. మాటల్ని తిప్పటం.. తప్పుగా మాట్లాడినా సమర్థించుకునే చతురత లోపించిన కాంగ్రెస్ పెద్దాయన కేటీఆర్ చేసిన తెలివైన ఫైరింగ్ తో డిఫెన్స్ లో పడ్డారనే చెప్పాలి. జానా చెప్పిన మాటల్లో నిజం ఉన్నప్పటికీ.. దాన్ని ఎస్టాబ్లిష్ చేసేలా మాట్లాడలేకపోవటం కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేలా చేసిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/