గ్రేటర్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన టీఆర్ ఎస్ పార్టీకి.. అంతటి చారిత్రక విజయాన్ని అందించిన మంత్రి కేటీఆర్ కు పురపాలక శాఖను కట్టబెడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. కొడుకు కష్టాన్ని కేసీఆర్ గుర్తించి.. ప్రమోషన్ ఇచ్చినట్లుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రమోషన్ ఒక్క కొడుక్కే కాదు.. మరికొందరికి కూడా అన్న విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి తాజాగా స్పష్టత ఇవ్వటం గమనార్హం.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దనున్న శాఖల్ని ఒక్కొక్కటిగా వదిలించుకోవటం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామం. వివిధ శాఖల్ని తన వద్దన ఉంచుకున్న ముఖ్యమంత్రి.. వాటిల్లో కొన్నింటికి గతంలో కొందరు మంత్రులకు కేటాయించారు. తాజాగా పురపాలక శాఖను కేటీఆర్ కు అప్పజెప్పిన వైనం తెలిసిందే. ఇక.. ముఖ్యమంత్రి వద్ద.. ఎస్సీ అభివృద్ధి.. సహకార శాఖ.. సమాచార.. సాధారణ పరిపాలన.. బొగ్గు.. మైనార్టీ సంక్షేమ శాఖలు ఉన్నాయి. వీటిల్లో తాజాగా ఎస్సీ అభివృద్ధి.. సహకార శాఖను విద్యుత్తు మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగిస్తూ మంగళవారం జీవో విడుదల చేశారు.
ఇక.. తనవద్ద మిగిలిన సమాచార శాఖను మేనల్లుడు కమ్ మంత్రి అయిన హరీశ్ కు.. మైనార్టీ శాఖను ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీకి.. మిగిలిన శాఖల్ని ఒకరిద్దరు సీనియర్ మంత్రులకు అప్పగించి.. తాను ఫ్రీ అయిపోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. నిత్యం పలు కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతోపాటు.. రాష్ట్ర ముఖచిత్రం మార్చే అంశాలపై ప్లానింగ్ పై దృష్టి పెట్టే క్రమంలో.. తన వద్దనున్న శాఖలకు సంబంధించిన ఫైళ్లను చూడటం కష్టంగా మారటం.. కుప్పలు కుప్పలుగా ఫైళ్లు పెండింగ్ లో ఉండిపోవటాన్ని గుర్తించి కేసీఆర్.. ఆ ఇబ్బందిని అధిగమించేందుకు వీలుగా తాజాగా అదనపు శాఖలు అప్పచెబుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.