తాను చేసే ప్రతి పనిని ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకోవటం.. మాట్లాడే ప్రతి మాటకు ముందు రెండుసార్లు అన్ని చూసుకొని మాట్లాడే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తాను ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారీ.. ఆయన ఎంపిక చేసుకునే అంశాలు మాత్రమే కాదు.. ప్రెస్ మీట్ సందర్భంగా తన పక్కన ఎవరు కూర్చోవాలన్న విషయం మీద క్లారిటీ ఉంటుంది. ముందస్తుగా వచ్చే సంకేతాలకు తగ్గట్లే.. సారు పక్కన కూర్చునే అవకాశం లభిస్తుంది.
పుర ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా.. పార్టీ సాధించిన రికార్డు విజయం నేపథ్యంలో మీడియాను ఉద్దేశించి తాను చెప్పాలనుకున్న విషయాలతో పాటు.. తన ఫ్యూచర్ ప్లాన్లను చెప్పుకుంటూ వచ్చారు. తన రాజకీయ ఎజెండాను స్పష్టంగా చెప్పటం పెద్ద విషయం కాకున్నా.. ఎప్పుడూ లేని రీతిలో తాజా ప్రెస్ మీట్ లో కేసీఆర్ వ్యవహరించారని చెప్పాలి.
కొడుకైనా.. కుమార్తె అయినా.. మేనల్లుడు అయినా తనకు తానుగా వారిని ప్రమోట్ చేసినట్లుగా వ్యవహరించరు కేసీఆర్.వారి గురించి ప్రస్తావన వస్తే బాగుండన్న ప్రతిసారీ.. ఆ పని మాత్రం చేయకుండా ఉండటం.. ఆ దిశగా ప్రశ్నలు మీడియా వారి నోటి నుంచి రాకుండా కట్టడి చేయటం కేసీఆర్ కు మాత్రమే చేతనైన విద్యగా చెప్పాలి. పార్టీలో క్రమపద్దతిలో కేటీఆర్ స్థాయిని పెంచుకుంటూ పోయిన ఆయన.. త్వరలో కుమారుడి పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
తాజా ప్రెస్ మీట్ చూస్తే.. ఎప్పుడూ లేని రీతిలో తన కుమారుడు కమ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ను పక్కన పెట్టుకున్న వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. విజయాలు టీఆర్ఎస్ కు కొత్తేం కాదు.. ఆ మాటకు వస్తే గ్రేటర్ ఎన్నికలు జరిగి కలలో కూడా ఊహించని భారీ మెజార్టీలతో సీట్లు సొంతం చేసుకున్న వేళలోనూ కేటీఆర్ ను తన పక్కన కూర్చోబెట్టుకోని కేసీఆర్.. తాజా ప్రెస్ మీట్ లో మాత్రం అందుకు భిన్నంగా పక్కనే కూర్చోబెట్టుకోవటమే కాదు.. మీడియా మీట్ ఆరంభంలోనే.. కొడుక్కి ఆశీస్సులు అందించిన వైనం కాస్త కొత్తగా.. రోటీన్ కు భిన్నంగా ఉందని చెప్పక తప్పదు.