జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అవకాశాలను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భారీగా డ్యామేజీ చేస్తున్నారా? ఆయన వ్యాఖ్యలు సానుకూల ఫలితాలను ఇవ్వడానికి బదులుగా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయా? సెటిలర్లతోపాటు తెలంగాణ వాదుల్లోనూ ఆయన వ్యాఖ్యల ప్రభావం ఉంటోందా? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నాయి టీఆర్ ఎస్ వర్గాలు.
టీఆర్ ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తెలుగు రాష్ట్ర సమితి అని కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మేరకు పేరు మార్చుకుంటున్నామని కూడా చెప్పారు. అంతేనా.. త్వరలో ఆంధ్రప్రదేశ్ లోనూ టీఆర్ ఎస్ ను విస్తరించనున్నామని, తాను భీమవరంలో పోటీ చేయనున్నానని చెప్పారు. కోడి పందేలను చట్టబద్ధం చేస్తే చాలు అక్కడి వాళ్లు తనకు బ్రహ్మరథం పడతారని ఎద్దేవా చేశారు. తీవ్రస్థాయి విమర్శలు రావడంతో ఆ వెంటనే నాలుక కరుచుకున్నారు. తాను జోకు చేశానని చెప్పారు. దాంతో తొలిరోజు కేటీఆర్ వ్యాఖ్యలతో కాస్త సానుకూలంగా ఆలోచించిన సెటిలర్లు రెండో రోజు వ్యాఖ్యతో, తాను జోక్ చేశానని అనడంతో మండిపడుతున్నారు. ఇక లంక నుంచి వచ్చిన వాళ్లంతా రాక్షసులేనని ఆంధ్రా వాళ్లను ఉద్దేశించి కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ లో సెటిలర్లు అంటూ ఎవరూ లేరని, తాను కూడా సెటిలర్ నేనని వ్యాఖ్యానించారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్ల ఓట్లు కీలకం అన్న విషయం అందరికీ తెలిసిందే. సెటిలర్లు సానుకూలం కాకపోతే టీఆర్ఎస్ అధికారం దక్కించుకోవడం కల్ల. ఈ విషయం టీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు. అందుకే వారిని ఆకట్టుకోవడానికి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, కేటీఆర్ తొలుత వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత తాను జోక్ చేశానని వ్యాఖ్యానించడం తీవ్రస్థాయిలో వివాదాస్పదం అవుతోంది. సెటిలర్ల విషయంలో టీఆర్ఎస్ వైఖరి ఎప్పటికీ మారదని దీంతో రుజువు అవుతోందని, సెటిలర్లను కేటీఆర్ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ హైదరాబాద్ లో యథాతథ స్థితి నెలకొంటుందని, తన్ని తరిమేసినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలు పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేశాయని ఆ పార్టీలోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.