ఎన్నికలు ఏవైనా సరే.. ప్రతికూలతను సానుకూలతగా మార్చుకొని విజయబావుటా ఎగురవేసే సత్తా టీఆర్ఎస్ సొంతం. సార్వత్రిక ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల వేళలో పని తీరు ఎలా ఉన్నా.. ఉప ఎన్నికల్లో మాత్రం చెలరేగిపోయి.. రాజకీయప్రత్యర్థులకు చుక్కలు చూపించే తీరు టీఆర్ఎస్ సొంతం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోనే అదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు నిరూపించారు గులాబీ దళ అధినేత.
అలాంటి కేసీఆర్ తొలిసారి.. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తడబాటు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఉప ఎన్నిక అన్నంతనే సమరోత్సాహంతో చెలరేగిపోవటమే కాదు.. తన అమ్ములపొదిలోని భావోద్వేగ అస్త్రాల్ని వరుస పెట్టి సంధించటం.. ఎన్నిక మొత్తాన్ని ఒక పక్కకు ఒరిగిపోయేలా చేయటం.. తుది ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం కేసీఆర్ కు మొదట్నించి అలవాటు.
అందుకు భిన్నంగా ప్రచారానికి సైతం వెళ్లలేని పరిస్థితి హుజూర్ నగర్ లో ఉందా? అంటే అవునని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తొలినాళ్లలో చెలరేగిపోవటమే కాదు.. ఎన్నికల్లో విజయం పక్కా అని.. మెజార్టీ ఎంతన్నది మాత్రమే మాట్లాడుకోవాలన్న మాట మాత్రమే టీఆర్ఎస్ నేతల నోట వినిపించేది. అందుకు భిన్నంగా ఇప్పుడు సీన్ మొత్తం మారిందని చెబుతున్నారు.
ఆ మధ్యన ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి కేటీఆర్.. ఉత్తమ్ సతీమణిని ఉద్దేశించి వదినమ్మకు ఏం జరుగుతుందో తెలుసు.. ఆమెకు అవగాహన ఉన్నా బరిలో ఉన్నారంటూ ఒకలాంటి ఎక్కెసం చేసినా.. దానికి సరైన రీతిలో బదులు చెప్పలేని పరిస్థితి. ఆర్టీసీ సమ్మె మొదలైన నాటి నుంచి నియోజకవర్గంలో పరిస్థితి మారిందంటున్నారు. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం సైతం హుజూర్ నగర్ పైన ప్రత్యేక నజర్ వేయటంతో టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
అడుగు తీసి అడుగు వేయాలన్నా ఇబ్బందిగా ఉందంటున్నారు. దీనికి తగ్గట్లే.. తొలినాళ్లలో చెలరేగిపోయి తీరులో ప్రచారం చేసిన మంత్రి కేటీఆర్.. గడిచిన కొద్ది రోజులుగా అడ్రస్ లేకుండా పోవటం.. టాస్క్ మాస్టర్ గా చెప్పే హరీశ్ సైతం కామ్ గా ఉండటం చూస్తుంటే.. లెక్కలో ఎక్కడా తేడా కొట్టిన వైనం స్పష్టమవుతోంది. ఎన్నికల ప్రచారంలో కీలక నేతలు కనిపించటం లేదంటే.. తాము ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవటం లేదన్న సంకేతాల్ని పంపటంగా చెబుతారు.
రేపొద్దున ఫలితం తేడా కొడితే.. తమ పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఎవరూ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదనే మాటను చెప్పి తప్పించుకోవటానికి వీలుగా హుజూర్ నగర్ కు ముఖం చాటేస్తున్నారని చెబుతున్నారు. నోటిషికేషన్ వేళలో గులాబీ దళంలో వెల్లివిరిసిన ఉత్సాహం.. ప్రస్తుతం నెలకొన్న నీరసం చూసినప్పుడే పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్లుగా అర్థమవుతుందంటున్నారు. మరి..చివర్లో సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటే తప్పించి.. లెక్క తేడా మాత్రం పక్కా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేమవతుందో తుది ఫలితం వెల్లడయ్యే వరకూ వెయిట్ చేయక తప్పదు.