ఎన్నికల వేళ అబద్ధమైనా అతికేట్లు చెప్పాలి. ఆ మాత్రం టాలెంట్ లేకుండా ఇవాల్టి రోజున నడిచే ఎన్నికల్లో నెట్టుకొచ్చేదెట్లా? అప్పట్లో మైకుల్లో ప్రచారాలు ఉండేవి. చెప్పే విషయాల్ని ఓపెన్ గానే చెప్పేసేటోళ్లు. ఇప్పుడు అలా కాదు కదా? సోషల్ మీడియా పేరుతో తమ మెదడులోని పైత్యమంతా పెట్టేసి.. మైండ్ ను ఖరాబు చేసే బ్యాచ్ లు కుప్పలు కుప్పలుగా రంగంలోకి దిగే పరిస్థితి. ఎవరేం చెప్పారో తెలిస్తే.. దాని వెనుక లెక్క ఇట్టే అర్థమవుతుంది. అలాకాకుండా ఎవడో తయారు చేసిన దాన్ని.. మరెవరో షేర్ చేస్తూ.. తాము అనున్నది వైరల్ చేయటం.. తాము మద్దతు ఇచ్చే వర్గానికి మేలు కలగటమే తప్పించి.. మరింకేమీ ఆలోచించే ఈ డిజిటల్ యుగంలో కూడా కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు విన్నప్పుడు కాసింత నిరాశ కలుగక మానదు.
అంతర్జాతీయ వేదికల మీద ఇరగదీసిన సామర్థ్యం.. సత్తా ఉందంటూ మంత్రి కేటీఆర్ గురించి మా గొప్పలు చెప్పేసేటోళ్లకు.. ప్రెస్ మీట్ పెట్టి అదే పనిగా ప్రయాస పడిపోయిన చిన్నసారును చూసినప్పుడు.. రోటీన్ రాజకీయ నాయకుడు కళ్ల ముందు కనిపించే పరిస్థితి. ఎవరిదాకానో ఎందుకు? తాను కూర్చుని అదే పనిగా గొప్పలు చెప్పే సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లోని విలేకరులకు అయితే ఇళ్ల స్థలాలు లేదంటే అపార్ట్ మెంట్లు కట్టించి ఇస్తానని చెప్పి ఆరేళ్లు దాటినా.. ఇప్పటివరకు ఆ హామీ అడుగు ముందుకు పడని పరిస్థితి.
అదేమంటే.. కోర్టులో వివాదం ఉంది కదా అనేస్తారు. కోర్టులో కేసులు ఉన్నప్పటికీ.. కేసీఆర్ కల అయిన కొత్త సచివాలయం కోసం పాత సచివాలయాన్ని కూల్చలేదా? నిజంగా ప్రభుత్వం అనుకుంటే.. సమస్యకు పరిష్కారం ఎంతసేపు? దాన్ని పక్కన పెట్టేసి రొడ్డు కొట్టుడు మాటలు ఆయన చెప్పటం.. నిజం తెలిసినా తెలియనట్లుగా చెప్పింది రాసేసుకునే అలవాటు పెరిగిన పాత్రికేయులు నడుమ ప్రశ్నించే పాత పద్దతిని ఆశించటం అత్యాశే అవుతుంది.
ఈ ప్రెస్ మీట్ లో కేటీఆర్ చెప్పిన మాటలన్నింటికి కౌంటర్ చెప్పటం అనవసరం. ఆయన చెప్పిన ఆణిముత్యం లాంటి మాటల్లో అయినా కాస్తంత నిజం ఉండి ఉంటే బాగుండేది. ఇంతకూ కేటీఆర్ నోటి నుంచి వచ్చిన ఆ నిజాలు ఏమిటంటే.. ‘‘హైదరాబాద్ లో పేకాట క్లబ్బుల్లేవు. గుండుంబా గబ్బు లేదు. బాంబు పేలుళ్లు లేవు. మత కల్లోలాలు లేవు. అల్లర్లు లేవు. కర్ఫ్యూ లేదు. ఆకతాయిల ఆగడాలు లేవు. పోకిరీల పోకడలు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు గుండె మీద చేయి వేసుకొని వాస్తవాల గురించి ఆలోచించాలి’’ అంటూ తనకు అలవాటైన మాటలతో అదరగొట్టేశారు.
ఈ మాటల్ని దేనికదే చూసినప్పుడు.. కళ్ల ముందు వాస్తవాలు రీల్ మాదిరి కనిపించే వేళలో.. ఇంతలా ఎలా చెప్పేస్తారన్న సందేహం కలుగక మానదు. అయితే.. కేటీఆర్ చెప్పిన మాటల్లో ఒకటి మాత్రం నిజం. కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత బాంబుపేలుళ్లు మాత్రం లేవని చెప్పాలి. మిగిలిన వాటికి సంబంధించిన నిజాలు.. వాస్తవాలు హైదరాబాద్ మహానగరంలో ఉండే కోటికి పైగా జనాభాకు తెలిసిన సత్యాలే. తెలిసిన నిజాల్ని తెలీవనుకోవటం వల్ల లాభమేంది? అయినా.. చాలా చేశామని చెప్పే బదులు.. కొన్ని చేస్తాం.. మరోసారి అవకాశం ఇస్తే మరింత చేస్తామన్న నిజాయితీ మాట సూటిగా చెప్పేస్తే బాగుండేది కదా కేటీఆర్?