సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏ విషయంపైనా ఎప్పటికప్పుడు స్పందిస్తారనే పేరు తెచ్చుకున్నారు. అందుకే చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం కోసం కేటీఆర్‌ను సంప్రదించడానికి ట్విట్టర్‌ను ఆశ్రయిస్తుంటారు. కేటీఆర్ కూడా వారిని నిరాశపరచ పరచకుండా.. సాయం చేస్తుంటారు.
ఇక, తన రాజకీయ ప్రత్యర్థులపై కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడమే కాకుండా ఇంటర్నెట్‌లో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రచారం కూడా చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణలో వ్యాపారాన్ని ప్రారంభించాల్సిందిగా టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ను ఆహ్వానించారు.
ఎలన్ మస్క్ ట్వీట్‌ను ఉటంకిస్తూ మంత్రి కేటీఆర్ ఈ విధంగా పేర్కొన్నారు. ''హే ఎలాన్, నేను భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిని. భారతదేశం/తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు, సవాళ్లతో కూడిన పని చేయడంలో టెస్లా భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది. మా రాష్ట్రం సుస్థిరత కార్యక్రమాలలో ఛాంపియన్. భారతదేశంలో అగ్రశ్రేణి వ్యాపార గమ్యస్థానంగా ఉంది`` అని పేర్కొన్నారు.
ఇంతకు ముందు, ఒక అభిమాని టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడంపై ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఆయన మస్క్‌కి లేఖ రాశారు. దానికి ప్రతిగా మస్క్ "ఇప్పటికీ ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కొంటు న్నాం`` అని బదులిచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తిగా స్పందించారు.
టెస్లాకు సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి కేటాఆర్ పేర్కొన్నారు. సుస్థిరత కార్యక్రమాలలో తెలంగాణను ఛాంపియన్‌గా నిలబెట్టేందుకు, దేశంలోనే అగ్రశ్రేణి వ్యాపార గమ్యస్థానంగా నిలబెట్టేందుకు చేస్తున్న కృషిని వివరించారు. భారత్‌లో తమ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంలో టెస్లా భాగస్వామి కావడం పట్ల తెలంగాణ సంతోషంగా ఉందన్నారు.